నా దగ్గర డబ్బులు లేవు.. కావాలంటే నా నగ్న వీడియో చూసి ఇవ్వండి

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి హైదరాబాద్ లో డ్రగ్స్ దందా గుట్టు సంచలనం రేపుతోంది. ఇప్పటికే పలు స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ భూతం విసురుతున్న పంజాలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ఖరీదైన స్కూళ్లలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాల్లో కూడా డ్రగ్స్ లభిస్తుండటం గమనార్హం. దాదాపుగా ఇరవైకి పైగా స్కూల్ లలో ఈ డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు అధికారులు సంచలన విషయాలు బయట పెట్టడంతో.. తల్లి తండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

తాజాగా అరెస్టయిన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుడు ఉన్నట్టు తెలుస్తుంది. అతనితో పాటు దీపక్, అబ్దుల్ అనే ఇద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకోగా.. వీరి నుంచి 16 డోసుల ఎల్ఎస్డీ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సదరు సినీ ప్రముఖుడిని పోలీసులు విచారిస్తున్నారు. అంతే కాక.. ఎందరో చిన్నారులను మత్తు మందులకు బానిసలను చేసిన దుర్మార్గులు సాగించిన దాష్టీకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో వందల కొద్దీ వాట్స్ యాప్ గ్రూపులు ఉండగా.. వాటిల్లోని విషయాలు పోలీసులనే షాకింగ్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఓ గ్రూప్ లోని వీడియో ఒకటి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఓ యువతి తనకు మత్తుమందులు కావాలని కోరుతూ.. 'నా దగ్గర డబ్బులు లేవు.. కావాలంటే నా నగ్న వీడియోని ఎవరికైనా విక్రయించి.. ఆ వచ్చిన డబ్బుకు ఎంత వస్తే అంత మత్తుమందు ఇవ్వండి' అని ఉన్న మెసేజ్ ని చూసి పోలీసులు ఖంగు తిన్నారు. దీనితో హైదరాబాద్ యువత డ్రగ్స్ కి ఏ రేంజ్ లో బానిసలు అయ్యారో అర్ధం అవుతుంది. ముందు ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.

No comments