Alert Alert: ఇలాంటి 500 రూ ల నోట్లను తీసుకోకండి...


శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలు అనే విషయం నకీలీ నోట్ల తయారీ దారులకు బాగా తెలుసనే చెప్పుకోవాలి. ఎందుకంటే... పెద్ద నోట్ల రద్దు అనంతరం విడుదలైన రూ. 2000 నోట్లను ఇప్పటివరకూ సామాన్యులు ఎంతమంది నేరుగా చూశారో లేదో తెలియదు కానీ... పలువురు అక్రమార్కులు ఐతే వాటికి అప్పుడే నకిలీలను తయారు చేసి మార్కెట్లకు వదులుతున్నారు. దీంతో అప్పటివరకూ ఒక్కసారి కూడా ఒరిజినల్ రూ.2000 నోట్లను చూడని వారు ఆ నకిలీ నోట్లను చూసి అదే ఒరిజినల్ అనుకుని ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇక ఇప్పటికే ఒరిజినల్ నోటును ఉపయోగిస్తున్నవారు కూడా నకిలీ నోట్లను గుర్తించే విషయంలో బోల్తా పడుతున్నారని తెలుస్తుంది!

అసలు నోట్లను కాపీ చేసి పెద్ద మొత్తంలో మార్కెట్లోకి వదిలేందుకు చాలా ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో తక్కువ మొత్తంలో నగదు చెలామణి అవుతున్న నేపథ్యంలో ఈ నోట్లను ప్రజల్లోకి తొందరగా చేరవేయడం వారికి సులభమవుతోంది.

No comments