బల్లి శబ్ద శాస్త్రం ...


మన శరీరం మీద బల్లిపడిన యడల కలుగు శుభాశుభములు ....
మీ ఇంట్లో బల్లి శబ్ధం చేస్తుందా..? అప్పుడప్పుడు కిందపడి పరుగెడితుందా? గోడపై మీ కంట పడేటట్లు అటూ ఇటూ తచ్చాడుతుందా? అయితే ఈ కథనం చదవాల్సిందే.
.
ఈ బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుండి గనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ వున్నది. అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూద వున్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని నమ్మిక. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో నమ్మకమున్నది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాల గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఇదేవిధంగా ఆగ్నేయంలో బల్లి శబ్ధం చేస్తే ఇంట్లో కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడుతాయి. ఇక దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే కుజ గ్రహ ప్రభావంతో శుభకార్యాలు జరగడం, అదృష్టం కలిసివస్తుందని గ్రహించాలి. అదే మీ పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్ధం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన వార్త అందుతుంది.
ఇంకా నైరుతి దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే బుధ గ్రహ ప్రభావంతో బంధువులు రాక, స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు, శుభవార్తలు వంటి శుభఫలితాలుంటాయి. అలాగే పడమర దిశలో బల్లి శబ్ధం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది. అదే ఉత్తర దిశలో బల్లి శబ్ధం చేస్తే శుభ వార్తలు అందుతాయి.
బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లికి తెలియక తొక్కేయడం లేదా చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు పురోహితులు చెబుతున్నారు.
మన శరీరం మీద బల్లిపడి యడల కలుగు శుభాశుభము ....
పురుషులకు కలుగు శుభాశుభములు :....
తలమీద = కలయము,
బ్రహ రంద్రమున = మరణము
ముఖము = ధనలాభము
ఎడమ కన్ను = శుభం
కుడుకన్ను = అపజయము
నుదురు = బంధు సన్యాసము
కుడి చెవి = దుఖము
ఎడమచెవి = లాభము
పై పెదవి = కలహము
క్రింది పెదవి = ధన లాభము
రెండు పెదవులపై = మృత్యువు
నోటియందు = రోగ ప్రాప్తి
ఎడమ మూపు = జయం
కుడి మూపు = రాజ భయం
మణికట్టు = అలంకార ప్రాప్తి
మోచేయి = ధన హాని
వ్రేళ్ళపై = స్నేహితుల రాక
కుడిభుజము = కష్టము
ఎడమ భుజము = అగౌరవము
తొడలు = వస్త్ర నాశము
మీసములపై = కష్టము
పాదములు = కష్టము
పాదముల వెనుక = ప్రయాణము
కాలి వేళ్ళు = రోగ పీడనము.
స్త్రీలకు కలుగు శుభశుభములు :...
తలమీద = మరణ సంకటం
కొప్పుపై= రోగ భయం
పిక్కలు = బంధు దర్శనము
ఎడమ కన్ను = భర్త ప్రేమ
కుడికన్ను = మనో వ్వథ
వక్షము = అత్యంత సుఖము, పుత్ర లాభము.
కుడిచెవి = ధన లాభము
పైపెదవి = విరోదములు
క్రింది పెదవి = సూకగ వస్తు లాభము
రెండు పెదవులు = కష్టము
స్థనము నందు = అధిక దుఃఖము
వీపునందు = మరణ వార్థ
గోళ్ళయందు = కలహము
చేతియందు = ధన నష్టము
కుడుచేయి = ధన లాభము
ఎడమ చేయి = మనో చలనము
వ్రేళ్ళపై = భూషణ ప్రాప్తి
కుడి భుజము = కామ రతి ప్రాప్తి
తొడలు = వ్వభిచారము , కామము,
మోకాళ్ళు = బంధనము,
చీలమండలము = కష్టము
కుడికాలు = శత్రు నాశనము
కాలి వేళ్ళు = పుత్ర లాభము

No comments