సెల్పీ కోసం ప్రాణాలనే పనంగా పెడుతున్నారు....!!!
యువతీ యువకులలో రోజు రోజుకు సెల్ఫీ పిచ్చి ముదిరిపోతోంది.. సెల్పీ కోసం ప్రాణాలనే పనంగా పెడుతున్నారు. చావు అంచుల మధ్యకు వెళ్లి సెల్ఫీలు దిగి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు... రోజుకు కనీసం 14 సెల్ఫీలు దిగనిదే ఎవరికీ నిద్ర కూడా పట్టడం లేదట..
ఇక పెద్ద వయస్సు వారు కూడా పిల్లలకి ఏ మాత్రం తీసిపోమన్నట్లుగా సెల్ఫీలో చాలా యాక్టివ్ గా ఉన్నారట. ఈ విషయం గూగుల్ సర్వేలో వెల్లడయింది. కొందరు దీన్ని పిచ్చి అనుకోవచ్చు, మరికొందరు వ్యసనం అనుకోవచ్చు. ఏదయితేనేమి గాని యువత సాధారణంగా రోజుకు 14 సెల్ఫీలు క్లిక్ మనిపించే దాకా నిద్రపోరట. సెల్ఫీలు తీసుకునేవారిలో యవ్వన వయసు వారిదే అగ్రస్థానం.
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గూగుల్ సర్వేలో ఇదే విషయాన్ని వెల్లడించారు. సుమారు 11 గంటలకు పైగా మొబైల్ వినియోగిస్తున్న వారు దాదాపు 14 సెల్ఫీలు, 16 ఫోటోలు లేదా కొన్ని వీడియోలు తీసుకుంటారని గూగుల్ సంస్థ నిర్వహించిన సర్వే లో వెల్లడయింది. ఫేస్ బుక్ ,ట్విట్టర్,ఇతర ఖాతాలను 21 సార్లు ఓపెన్ చేస్తుంటారని 25 టెక్ట్స్ మెసేజ్ లు పంపుతారని పరిశోధనలో తేలింది.
నాలుగు ఫోటోలు, ఓ వీడియో ఇదిలా ఉండగా నడి వయస్కులు,అంతకంటే పెద్ద వయసున్నవారు మాత్రం రోజుకు నాలుగు ఫోటోలు ఓ వీడియో 2 నుంచి నాలుగు సెల్ఫీలు తీసుకుంటారట. మరీ అధికంగా సెల్ఫీలు తీసుకోవడం ఓ మానసిక రుగ్మత గానే భావించాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సెల్ఫీలు వినూత్నంగా తీసుకోవడానికి యత్నించి చాలామంది ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.
సో సెల్పీల పిచ్చి ముదిరి పాకాన పడకముందే దాని నుంచి బయటపడటం చాలా మంచిది.
Post a Comment