రోజాపై యండమూరి తిట్లదండకం.. బజారు కుక్క, శవాలపై బిజినెస్ చేసే రకం
రచ్చబండ షో ఇప్పుడు బుల్లి తెరపై చర్చనీయంశంగా మారింది. జబర్‌దస్త్‌లా సాఫ్ట్‌గా నవ్వుతూ ఈ కార్యక్రమంలో రోజా కన్పించడానికి కుదరదు. అసలే ఎమ్మెల్యే, పైగా డైనమిక్. ఇంకేముంది, అదిలించేసి.. అదరగొట్టేస్తున్నారు రోజా. అతి తక్కువ కాలంలోనే ఈ షో మంచి రేటింగ్స్ సంపాదించుకుంది అదే స్థాయిలో విమర్శలని కూడా తెచ్చుకుంది. అసలు ఈ షో కి వచ్చేవాళ్ళు నిజమైన దంపతులేనా? లేదంటే డబ్బులిచ్చి మరీ ఇలాంటి గొడవలతో వాళ్ళని ఈ షో కోసం తీసుకువస్తున్నారా అన్న అనుమానాలూ ఉన్నాయి. ఇప్పటికే ఆ షో లలో హోస్ట్‌గా చేసిన సుమలత, జీవిత రాజశేఖర్ ఇద్దరూ రకరకాల విమర్శలతో తప్పుకున్నారు. ఒక షో కి రానన్న ఒక భర్తని, జీవితా రాజశేఖర్ అనుచరులు బెదిరించినట్టుగా కూడా సమాచారం కూడా ఉంది. ఈ ఘటనలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినా సరే ఇక్కడ వచ్చే పాపులారిటీ రెమ్యూన రేషన్ మిగతా ఆఫర్లకంటే ఎక్కువగా ఉండటం తో ఈ షో చేయటానికి ఒప్పుకుంది రోజా. కానీ ఈ మధ్య ఆ షోలో రోజా ఓవరాక్షన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అదేంటంటే.. నాలుగు గోడల మధ్య జరగాల్సిన గొడవను, షో పేరుతో నాలుగు కోట్ల మంది చూసేలా వాళ్ల పరువును బజారుపాలు చేస్తున్నారు. ఈ షో ఎంత దారుణం అంటే టీ.ఆర్.పి రేటింగ్స్ కోసం గొడవలను కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కింద చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో మాటలకంటే "బీప్...బీ..ప్" మంటూ వచ్చే ఎడిట్ సౌండే ఎక్కువ సార్లు వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ప్రేక్షకులకు ఆ బూతు అర్థమయ్యేలాగా మొదటి అక్షరం లేదా చివరి అక్షరం వినిపిస్తారు. నిజంగా ఈ షోస్ ద్వారా కాపురాలని చక్కబెడుతున్నారన్న విషయాన్ని పక్కన పెడితే ఒక ఇంటి పరువును రోడ్డుకీడుస్తున్నారనే విషయం ఖచ్చితంగా అర్ధమౌతుంది. అనిన విమర్శలనుంచీ అసలు ఇలాంటి టీవీ షోలని రద్దు చేసేయ్యాలనే వాదన కూడా వచ్చింది. ఈ తరహా కార్యక్రమాల్లో వాస్తవాల గురించి ఓ న్యూస్ ఛానెల్ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ను ప్రశ్నించింది. మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూడాల్సిన అవసరం లేదని యండమూరి సమాధానమిచ్చారు.
ఇలాంటి షోలని చూడటం వల్ల మానసిక ప్రశాంతత కూడా పోతుందని చెప్పారు. మానసిక వికాస నిపుణుడిగా తనకున్న అనుభవంతో టీవీ ఛానెల్స్ కు ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను ప్రసారం చేయవద్దని సూచిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఇటువంటి చెత్త ప్రోగ్రామ్ లను చూడకుండా ఉంటే రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కుటుంబ కలహాల షోలలో పాల్గొనే వారికి తాము తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదని కేవలం పాపులారిటీ కోసం చేస్తుంటారని అన్నారు. ఆ టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్లు తమను మేథావులుగా భావించుకుంటారని ఆరోపించారు. తీర్పులిచ్చేవాళ్ల సీక్రెట్లన్నీ తనకు తెలుసన్నారు. హైదరాబాద్ లో వారు సంప్రదించే సైకియాట్రిస్ట్ లందరూ తనకు ఫ్రెండ్సేనని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా అది తీర్పిచ్చేస్తూ ఉంటుందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ షో ల ఉద్దేశం ‘శవాల మీద డబ్బులు ఏరుకోవడమే' అంటూ మరింత ఘాటుగానే తన అభిప్రాయాన్ని చెప్పారు.
Post a Comment