పవన్ కళ్యాణ్ కి అంత కోపం ఎందుకు? మూడో పెళ్లి గురించి ఏమైనా అడిగాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో ఆవేశం పాలు ఎక్కవని అందరికీ తెలిసిందే. తన మనసుకు నచ్చని పని ఏది కనిపించినా.. వినిపించినా పవన్ లో ఆవేశం పొంగుకొస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ లో ఆవేశం మరో సారి కట్టలు తెంచుకుందట. దీనికి ఓ సినీ కమెడియన్ బలిఅయ్యాడని తెలుస్తుంది. మరి పవన్ కి కోపం వచ్చేలా ఆ కమెడియన్ ఏమి చేసాడు. పవన్ కి ఎందుకు అంతలా కోపం వచ్చిందనే ఆరా తీస్తే సదరు కమేడియన్ రాజకీయాల గురించి అడగమేనట. దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న తాజాగా సినిమాలో పవన్ తో పాటు ఓ కమెడియన్ కూడా నటిస్తున్నాడట.
పవన్ కల్యాణ్ అంత వరకూ మాములు విషయాలు మాట్లాడుతున్న సదరు కమెడియన్ ‘జనసేన’ ప్రసక్తిని ఎత్తాడట. పార్టీ పనులు ఎంత వరకూ వచ్చాయి సార్.. అని ఆరా తీశాడట. పవన్ కల్యాణ్ తన పొలిటికల్ విజన్ గురించి ఏమైనా చెబుతాడేమో అని ఆ కమేడియన్ ఆశించి ఆ ప్రశ్న అడిగితే.. పవన్ కల్యాణ్ మాత్రం ఒక్కసారిగా భగ్గుమన్నాడట. నా పార్టీ గురించి నీకెందుకు? అన్నట్టుగా విరుచుకుపడ్డాడట. దీనితో అక్కడున్న వారితో పాటు.. అవాక్కవ్వడం సదరు కమేడియన్ వంతు అయ్యిందని సమాచారం. ఈ వ్యవహారంలో అక్కడే ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ కూడా స్పందించాడట.
దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ కే సపోర్ట్ చేసి మాట్లాడాడట. దీంతో ఫామ్ లో ఉన్న ఆ కమేడియన్ చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తుంది. అయినా.. ఆ నటుడు మరీ అంత తప్పు ప్రశ్న ఏమి ఉంది? పవన్ పెట్టిన పార్టీ ఏమైనా ఆయన ఇంటి వరకే పరిమితమా? ప్రజల పార్టీ నే కదా.. అయినా ఆ కమెడియన్ ఏమైనా మూడో పెళ్లి గురించి అడిగాడా? పార్టీ గురించి చెప్పడం ఇష్టం లేకపోతే.. మాట దాటవేయవచ్చు కదా.. జనసేన గురించి అడిగేసరికి పవన్ కల్యాణ్ కు అంత కోపం వస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉత్పన్నం అవుతున్నాయి. కాగా.. పవన్ తిట్టింది కమేడియన్ ప్రవీణ్ నే అని ఇప్పుడు మరో న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై అటు పవన్ గానీ, ఇటు ప్రవీణ్ గానీ ఇంకా స్పందించలేదు.
Post a Comment