రైల్లో ప్యాంట్ జిప్ తీసి నా ఎదురుగా ఆ పనిచేశాడు
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై వేదింపులు రోజు రోజుకీ పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు..కొంతమంది సున్నిత మనస్తత్వం ఉన్న అమ్మాయిలు ఈ వేదింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనం వింటున్నాం..అయితే ఇప్పుడు చెప్పబోయే సంఘటనలో మాత్రం ఒక మహిళ ధైర్యం చేసింది..ఆ వివరాల్లోకి వెళ్తే
ముంబై లోకల్ ట్రైన్ లో తనకు ఎదురైన ఒక వేధింపు అనుభవాన్ని చెబుతూ, రైళ్లలో పరిస్థితిని తేటతెల్లం చేస్తూ పూజా నాయర్ అనే మహిళ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు సంచలనం రేపుతోంది. బొరివాలీ నుంచి దాదర్ వెళ్లే ట్రైన్ లో ఒక వ్యక్తి ప్రవర్తించిన తీరును పూజ తన ఫేస్‌బుక్ అకౌంట్ లో ఒక పోస్టు ద్వారా వివరించింది. విస్మయం కలిగించే రీతిలో వ్యవహరించిన వ్యక్తి గురించి చెబుతూ, రైళ్లలో ఆడవాళ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
‘అది సాయంత్ర సమయం. లేడీ కంపార్ట్ మెంట్. ఐదారు మంది ఆడవాళ్లే ఉన్నాం. డోర్ దగ్గర మాత్రం ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. మ్యూజిక్ ప్లే చేసుకుని, చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉన్న నేను క్యాజువల్ గా అతడి వైపు చూశాను. అప్పటికే అతడు ఒక అమ్మాయిని దూషిస్తూ ఉన్నాడు. నా సెల్ ఫోన్ లో..
సౌండ్ రెడ్యూస్ చేసుకుని వినగా.. అతడు అకారణంగా ఆమెను తిడుతున్నాడని అర్థం అయ్యింది. నేను అతడినే గమనిస్తున్నాని వాడికి అర్థం అయ్యింది. నన్ను చూస్తూ కూడా తిట్టసాగాడు. బూతు పదాలతో నన్ను తిడుతున్నాడని అర్థం అయ్యింది. రైళ్లలో అలాంటి పిచ్చివాళ్లు తిరగడం మామూలే కదా అనుకున్నాను
కానీ అంతలోనే వాడి ఉద్దేశం అర్థం అయ్యింది. నాకు కొంచెం దగ్గరగా వచ్చాడు. ఉన్నట్టుండి ఫ్యాంట్ జిప్ తీశాడు. హస్తప్రయోగం చేసుకోనారంభించాడు. కర్కశమైన నవ్వుతో అలా నా వైపు చూస్తూ అలా చేస్తున్నాడు. కంపార్ట్ మెంట్ లోని మిగతా వాళ్లు తల దించుకున్నారు. కంప్లైట్ చేయాలనిపించింది. హెల్ప్ లైన్ నంబర్ తీసుకుని.. కాల్ చేశాను. వాడి నీఛ చేష్టల నుంచి చెప్పగా.. హెల్ప్ లైన్ లోని వ్యక్తి నవ్వుతున్నాడు..అతడికి నా ఫిర్యాదు తమాషా అనిపించింది.
కండవ్లీ స్టేషన్ లో వాడు దిగిపోయాడు. మళ్లీ హెల్ప్ లైన్ కు కాల్ చేసి.. ఈ విషయం చెప్పాను. అతడిని పట్టుకున్నారా? అని అడిగాను. అంతే, కాల్ కట్ అయ్యింది..’
ఈ చేదు అనుభవం గురించి వివరిస్తూ దారుణంగా ప్రవర్తించిన వ్యక్తి ఫొటోను కూడా పూజ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. సాయం కోసం ఫోన్ చేస్తే కాల్ కట్ చేస్తారా? రేప్ జరిగితే కానీ లైంగిక దాడి జరిగినట్టు కాదా? ఇలాంటి వేధింపులను భరించాల్సిందేనా? అని పూజ ప్రశ్నించారు. ఈ విషయంపై ఫిర్యాదును ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఎదురైన చేదు అనుభవం గురించి వివరిస్తూ, రైళ్లలో పరిస్థితి ఎలా ఉందో తెలియజెప్పిన ఆమెను అంతా ప్రశంసిస్తున్నారు.
Post a Comment