అమ్మాయిలు బ్రా లేకుండా..అబ్బాయిలు అండర్ వేర్ తో..ప్రపంచంలో జరిగే వింత పరీక్షలు


ప్రపంచం లో విద్య యొక్క స్థానం అందరికి తెలిసిందే, ఎక్కడ చూసినా చదువులో పోటీ ఎక్కువయింది.. ప్రస్తుత సమాజం,పోటీ ప్రపంచంగా మారిపోయింది.ఉన్నత స్థాయి చదువులు చదావాలంటే అందుకు ఎన్నో ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సి వస్తుంది....పరీక్ష అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి మానసిక ఒత్తిడిలు లేకుండా రాసేది.. కానీ పెద్ద ఎత్తున జరిగే పరీక్షలను ఎన్నో ప్రభుత్వాలు ఎంతో పకడ్బందీగా,కట్టుదిట్టంగా నిర్వహిస్తుంటుంది....కాపీలు కొట్టకుండా ఎన్నో రూల్స్ ను సిఫారసు చేస్తుంది షరతులు పెడుతుంది...కానీ కొన్ని ప్రవేశ పరీక్షలకు ఆయా యాజమాన్యాలు పెట్టె షరతులు చాలా వింతగా,కటినంగా కనిపిస్తుంటాయి....వాటిని చూస్తే ముక్కున వేలేస్కోవాల్సిందే అవేంటో ఇప్పుడు చూద్దాం.....

నార్త్ ఈస్ట్ చైనా దేశం లో అక్కడి విద్యార్దులు ఉన్నత చదువుల కోసం, హాజరయ్యే ఎంట్రన్స్ పరీక్షకు అక్కడి విద్యా యాజమాన్యం, ఆడపిల్లలు తమ బ్రాను తీసేసి హాజరవమనడం చాలా పెద్ద కలకలం రేపింది...దీన్నే బ్రాలెస్ నాన్ మెటల్ ఎగ్సాం అంటారు.
ఇలా నిర్వహించటానికి కారణం ఏంటంటే బ్రా లో సీక్రెట్ గా లిసనింగ్ డివైసెస్ లను మరియు ట్రాన్స్ మీటర్స్ వల్ల జరిగే కాపీయింగ్ ని అరికట్టడానికి ఇలాంటి కండీషన్ ను పెట్టిందట...

అలాగే ముందుగానే స్టూడెంట్ ను చాలా జాగ్రత్త గా చెక్ చేస్తారు ఎటువంటి మెటల్ ఆబ్జెక్ట్ లు లేకుండా చూస్తారు ఎంత్రంసే హాల్ల దగ్గర మెటల్ డిటెక్టర్ ను ఉంచుతారట దీనికి ఇన్విజిలేటర్ కు సైతం మినహాయింపు ఉండదు.....ఒక వేల పంటిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ను చేసుకున్నా మరియు కాలు సర్జరీ చేయించుకున్నా అందులో మెటల్ ఉంటుంది కాబట్టి వాటికి డాక్టర్ ప్రూఫ్ లు సమర్పించాలి మరి....

ఇక అల్జీరియా,ఇరాక్ దేశాలలో ఇంటర్నెట్ షట్ డౌన్ అనే ప్రక్రియను వాడతారు...అక్కడ ఎగ్సామ్స్ నిర్వహించినన్ని రోజులు ఇంటర్నెట్ సౌకర్యాన్ని పూర్తి దేశ వ్యాప్తంగా నిలిపివేస్తారు...కారణం ఏంటంటే అక్కడ విధ్యార్డులకి టెక్నికల్ నాలెడ్జి చాలా ఎక్కువగా ఉంటుందట...అలా దీన్ని 2016 లో ఈ నిర్ణయాన్ని తీసుకుంది అక్కడి ప్రబుత్వం...
తరువాతది అండర్ వేర్ ఎగ్సాం ఇది మన ఇండియా లోనే జరిగింది... సైనికుల నియామకం కోసం ఆర్మీ అధికారులు ముజఫర్‌పూర్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించారు. దానికోసం వందలాదిగా తరలివచ్చిన ఉద్యోగార్థులను కాపీ కొట్టడం, చూచిరాతలు, ఇతరత్రా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా చేయడం కోసం వారందరినీ బట్టలిడిసి అండర్‌వేర్ (డ్రాయర్)పైనే పరీక్ష రాయాలనే నిబంధన విధించారు. దీంతో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న 1100మంది యువకులు డ్రాయర్‌తోనే మైదానంలో కింద కూర్చొని పరీక్ష రాశారు. ఆ పరిస్థితుల్లో వారు ఎంత మానసిక ఆందోళనకు గురై ఉంటారు? మానసికంగా ఎంత కుంగిపోయి ఉంటారు? అలాంటి స్థితిలో ఎవరైనా ప్రశాంతంగా పరీక్ష రాయగలరా? అసలు అలా నిబంధనలు, నియంత్రణలు విధించేటప్పుడు ఉన్నతాధికారుల ఆలోచనాసరళి ఏమిటై ఉంటుంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు...
మరో వైపు చైనా లోని ఒక కాలేజి లో దాదాపు పన్నెండు వందల మంది విద్యార్దులను గ్రౌండ్ ఆవరణలో ఎండలో రాయిస్తారు ఎందుకని అంటే అలా చేస్తే ఎక్కువగా మాస్ కాపీయింగ్ జరగకుండా ఈ నిర్ణయం తీసుక్న్నామని వారు వివరించారు పైగా అక్కడి ఇంవిజిలేటర్లకు ఒక బైనాకులస్ ఇస్తారట కాపి జరగా కుండా చూడటానికి....
ఇక థాయ్ లాండ్ లోని కొన్ని యూనివెర్సిటీ ల్లో వింతగా, గుర్రానికి ఏవిదంగా దాని చూపు పక్కకి పోకుండా కళ్ళకు గంతలు ఎలా కడతారో అలాగే ఇక్కడి విద్యార్దులకు ఎగ్సామ్స్ టైం వారి కళ్ళకు వాటిని అమరుస్తారట ఎందుకంటె కాపీ జరగకుండా,పక్కకి దిక్కులు చూడకుండా ఉండేందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారట....
మనందరికీ ఫ్లైయింగ్ డ్రోన్ కెమరా గురించి తెలుసు దీన్ని అనేక రకాలుగా వాడుతున్నారు...కానీ బెల్జియం లో ని ఒక కళాశాలలో ఎగ్సామ్స్ లో కాపీయింగ్ జరుగకుండా వాడుతున్నారట...విచిత్రంగా ఉన్నా ఇది నిజం...ఈ కెమరాని ఎగ్సాం హాల్లో పెట్టి దాన్ని రిమోట్ తో ఇన్విజిలేటర్ ఆపరేట్ చేస్తుంటాడు....అది ఆణువణువూ గాలిస్తుంది కాబట్టి ఏమాత్రం అనుమానం కలిగినా వారిని డీబార్ చేసేస్తారట...
ఇవండీ వింత వింత గా జరిగే వింతైన పరీక్షలు....ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి కదా,కానీ అది రాసే వారికి ఎంత నరకమో మాటల్లో చెప్పలేనిది...

No comments