డ్రగ్స్ కేసులో బండ్ల గణేష్ ని పవన్ తప్పించారా?


తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సినిమా రంగానికి చెందిన వారికి డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయని మాత్రమె చెప్పడం, వారి పేర్లు వెల్లడించకపోవడంతో అనేక ఊహాగానాలు నడిచాయి. రవి తేజ, పూరి జగన్నాథ్, ఛార్మి లాంటి పాపులర్ వ్యక్తుల పేర్లు కూడా మీడియా లో చక్కర్లు కొట్టాయి. సినిమా ఫంక్షన్లలో హీరోలని విపరీతంగా పొగిడేసే ఒక నిర్మాత కూడా డ్రగ్స్ లిస్టు లో ఉన్నారని పుకార్లు రావడంతో అంతా ఆ నిర్మాత బండ్ల గణేష్ అనే అనుకున్నారు.

తాజాగా బయటకి వచ్చిన పేర్లలో రవితేజ పేరు లేదు కానీ ఆయన డ్రైవర్ పేరు ఉంది. ఇక బండ్ల గణేష్ పేరు అయితే ఇప్పుడు వినిపించడం లేదు. బండ్ల గణేష్ పవన్ కల్యాణ్ కు స్నేహం ఉంది కాబట్టి,  పవన్ ఈమధ్య కేటిఆర్ తో సెల్ఫీ దిగారు కాబట్టి, కేటిఆర్ తో చెప్పి పవన్ కల్యాణ్ బండ్ల గణేష్ పేరుని ఈ లిస్టు నుంచి తప్పించారని ఒకవర్గం ప్రచారం మొదలు పెట్టింది.  ఇది పవన్ కల్యాణ్ అంటే రాజకీయంగా గిట్టనివాళ్ళు ఇలాంటి ప్రచారానికి తెగబడుతున్నారు. అసలు ఈ లిస్టు లో బండ్ల గణేష్ పేరు ఉందో లేదో తెలియదు. తెలియకముందే పవన్ మీద బురదజల్లే ప్రోగ్రాం ని మొదలుపెట్టారు. “రాజకీయాలని సమూలంగా మార్చాలి, దానికోసం నేను దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం అయ్యే వస్తున్నాను” అని చెప్పే పవన్ , సామాన్యుడికి రాజకీయాన్ని చేరువ చేయాలని ప్రయత్నిస్తున్న పవన్ కల్యాణ్ ఇలాంటి చిల్లర విషయాలలో జోక్యం చేసుకుంటారా? వ్యక్తిగతంగా మద్యానికి కూడా దూరంగా ఉండే పవన్ డ్రగ్స్ కేసులో తన పలుకుబడిని ఉపయోగిస్తారా? ఏమాత్రం నమ్మబుల్ గా లేదు. దీన్ని కేవలం పవన్ కి మకిలి అంటించే ప్రయత్నం గానే చూడాలి.

No comments