వెంకీ ఫ్యామిలీకి షాక్ ..డ్ర‌గ్స్ కేసులో అత‌డు కూడానా


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని డ్రగ్స్ కుంభకోణం ఒక ఊపు ఊపుతుంది. ఏకంగా పేరుగాంచిన బ‌డా బ‌డా ప్ర‌ముఖులే నోటీసులు అందుకున్న వారిలో ఉండ‌డం విశేషం. దీనికంత‌టికీ కెల్విన్ సూత్ర‌ధారిగా చెప్తొన్న పోలీసులు,అస‌లు గుట్టును అధికారికంగా చెప్ప‌కుండానే ప‌లువురి పేర్లు మాత్రం మీడియాలో ప్రసారం అవుతున్నాయి.

ఈ కేసులో ప్ర‌ధాన పాత్ర‌దారుడిగా స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ పేరు బ‌లంగా వినిపిస్తుంది. ఈయ‌న‌కు నోటీసులు అందిన‌ట్లుగా స‌మాచారం.అయితే పూరీ శిష్యులే డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్న‌ట్లుగా తెలుస్తుంది. ఆయ‌న చుట్టూ ఉండే వారి పేర్లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.

అయితే విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం ప్రకారం ఇండస్ట్రీలో పేరుగాంచిన ప్రొడ్యూస‌ర్ల త‌న‌యులు ఇందులో ఉన్న‌ట్లుగా తెలుస్తుంది.ద‌గ్గుబాటి కుటుంబంలో కూడా ఒక‌రు డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లుగా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కావాల‌నే కొంద‌రి పేర్లు మాత్ర‌మే బ‌య‌ట‌పెట్టారు,అంద‌రి పేర్లు ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ద‌గ్గుబాటి కుటుంబం, అల్లువారి కుటంబం, మంచు వారి కుటుంబంలో కూడా డ్ర‌గ్స్ తీసుకునే వారున్నార‌ని,కావాల‌నే వారిపేర్ల‌ను బ‌య‌ట‌కు రానివ్వ‌టం లేద‌ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మీడియాను ప్ర‌శ్నించిన‌ట్లుగా స‌మాచారం. మ‌రి ఆ పేర్లను మీడియా ఎందుకు దాస్తుంది అని ప్ర‌శ్నించిన‌ట్లుగా స‌మాచారం.

No comments