సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వాడే వారికి మద్దతు తెలిపిన జీవిత.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు


ప్రస్తుతం టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం ఒక ఊపు ఊపేస్తుంది. టాలీవుడ్‌ ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా పోలీసులు నిర్థారించారు. పలువురి పేర్లు డ్రగ్స్‌కు బానిసైనట్లుగా పోలీసుల విచారణలో వెళ్లడి అయ్యింది. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న వారిని పట్టుకున్న నేపథ్యంలో వారు సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లను చెప్పడం, వారికి నోటీసులు అందించడం జరిగింది.
పోలీసులు ప్రస్తుతం ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు ఈనెల 19న పోలీసుల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

ఈ సమయంలోనే పోలీసుల ద్వారా నోటీసులు అందుకున్న టాలీవుడ్‌ సెలబ్రెటీలకు జీవిత రాజశేఖర్‌ మద్దతుగా నిలిచారు. విద్యార్థులు, రాజకీయ నాయకులు ఇంకా ఎంతో మంది డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. వారందరిని విడిచి పెట్టి ఎందుకు టాలీవుడ్‌పైనే పడ్డారు అంటూ జీవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.
డ్రగ్స్‌ తీసుకుంటున్న వారికి నోటీసులు ఇచ్చినట్లుగా పోలీసులు అధికారికంగా బయటకు చెప్పడంతో వారి పరువు పోయింది. అంటూ జీవిత వారికి మద్దతు పలికింది. జీవిత అలా మాట్లాడటంపై నెటిజన్స్‌ మండి పడుతున్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో జీవిత రాజశేఖర్‌లకు కూడా ఏమైనా భాగస్వామ్యం ఉందా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  

No comments