బన్నీ మెగాస్టార్ ఏంటి.. బలిసిందా?
అల్లు అర్జున్ ఇటీవల పలు వివాదాలకు కేంద్ర బింధువు అవుతున్నాడు. ఆ మద్య పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ వ్యాఖ్యలు చేసి పెను దుమారంను రేపడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇంకా కూడా పవన్ ఫ్యాన్స్‌పై ప్రభావంను చూపుతూనే ఉన్నాయి. బన్నీపై వారు తమదైన శైలిలో కసి తీర్చుకుంటున్నారు. ఇక ‘డీజే’ చిత్రం కారణంగా బ్రహ్మణుల వద్ద వివాదాస్పదుడు అయ్యాడు. తాజాగా అల్లు అర్జున్ తన ప్రమేయం లేకుండానే మరో వివాదంలో ఇరుకున్నాడు.
బన్నీని అభిమానులు ఇప్పుడు కొత్త పేరుతో పిలుస్తున్నారు. అదే మెగాస్టార్ అల్లు అర్జున్. కొందరు మెగా అభిమానులు అత్యుత్సాహంతో ఇలా పిలుస్తున్నారు. దాంతో ప్రముఖ టికెట్ బుకింగ్ ఆన్‌లైన్ సంస్థ అయిన బుక్‌మై షో వారు కూడా అల్లు అర్జున్‌ను మెగాస్టార్ అల్లు అర్జున్ అంటూ సంబోధిస్తున్నారు. తమ పోర్టర్‌లో మెగాస్టార్ అల్లు అర్జున్ అంటూ పోస్ట్ చేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్‌గా చిరంజీవి ఉండగా అప్పుడే మెగాస్టార్‌ను అల్లు అర్జున్‌కు ఎలా ఇస్తారు.
అయినా మెగాస్టార్ అనే బ్రాండ్‌కు అల్లు అర్జున్ అప్పుడే అర్హుడు కాదు అని, అయినా మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ మాత్రమే మెగాస్టార్ అనే పేరుకు సరైన వాడు అంటూ కొందరు అభిమానులు అంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కొందరు దుమ్మెత్తి పోస్తున్నారు. అల్లు అర్జున్‌కు వరుసగా మూడు నాలుగు సక్సెస్‌లు రాగానే బలిసింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
Post a Comment