బ్రేకింగ్‌ న్యూస్‌ : బాలయ్యకు తీవ్ర అస్వస్థత


నందమూరి బాలకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం అందుతుంది. తమిళనాడులో నిన్న మొన్నటి వరకు షూటింగ్‌లో పాల్గొని వచ్చిన బాలయ్య తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘శమంతకమణి’ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొనాల్సి ఉంది. కాని బాలకృష్ణ ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఆ కార్యక్రమంకు రాలేక పోయారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. బాలయ్యతో ప్రస్తుతం ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆనంద్‌ ప్రసాద్‌ ‘శమంతక మణి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకే సినిమా ఆడియో విడుదలకు బాలయ్య హాజరు అయ్యేందుకు ఓకే చెప్పారు. కాని చివరి నిమిషంలో ఫుడ్‌ పాయిజన్‌ అవ్వడం వల్లే హాస్పిటల్‌లో జాయిన్‌ అయినట్లుగా తెలుస్తోంది.

బాలయ్య పరిస్థితి నేపథ్యంలో ‘శమంతకమణి’ ఆడియో వేడుకను క్యాన్సిల్‌ చేయాలని నిర్మాత భావించినప్పటికి ఇతర సభ్యులు మరియు స్వయంగా బాలయ్య కూడా చెప్పడంతో ఆడియో వేడుకను కంటిన్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యంగానే ఉన్నాడని, ఆయన అస్వస్థతకు గురైన మాట వాస్తవమే, ప్రస్తుతం బాలయ్య పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. త్వరలోనే మళ్లీ బాలయ్య షూటింగ్స్‌తో బిజీ అవ్వనున్నాడు. 

No comments