మళ్లీ బాంబు పేల్చిన వర్మ.. సీఎం టెన్షన్‌


ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ హీరో నందమూరి తారక రామారావు జీవిత కథతో తాను ఒక సినిమా చేబోతున్నట్లుగా ఇటీవలే బాలకృష్ణ ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే బాలయ్యకు ముందుగానే వర్మ ఎన్టీఆర్‌ సినిమాను తీసుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాల దర్శకుడిగా పేరున్న వర్మ ఖచ్చితంగా ఎన్టీఆర్‌ సినిమాను పూర్తి వివాదాస్పదంగా తెరకెక్కించడం ఖాయం. ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించినా కూడా ఆ సినిమా వివాదాస్పదం అవుతుంది. దాంతో ఇప్పుడు వర్మ చేయబోతున్న సినిమాపై అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్‌ స్టార్స్‌తో ఈ సినిమాను హిందీలో వర్మ తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇందుకోసం ఒక తెలుగు పాటను కూడా స్వయంగా వర్మ రాశాడు. ఆ పాటను పాడి విడుదల చేశాడు. త్వరలోనే సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర అంటే ఖచ్చితంగా అందులో విలన్‌గా చంద్రబాబును చూపించాల్సి ఉంటుంది.
వర్మ అదే చూపిస్తాడని, ఎన్నికల ముందు ఇలాంటి సినిమా వల్ల ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. వర్మ ఎవరేం అన్నా కూడా తాను అనుకున్నది చేసి తీరే వరకు వదలడు. అంటే ఎన్టీఆర్‌ సినిమా కూడా చేసి తీరుతాడు. సినిమా ప్రారంభంకు ముందే పలు వివాదాస్పద అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పకనే చెబుతున్నాడు. సో ఎన్టీఆర్‌ సినిమా ఏదో వివాదంను రేపడం ఖాయం. 

No comments