ఈ ఫొటోల్లో ఉన్న ఆమె వయస్సు ఎంతో తెలుసా..? ఫొటోలకు, వయస్సుకు అస్సలు సంబంధం ఉండదు..!
నేటి తరుణంలో సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో అస్సలు చెప్పలేం. కొన్ని నిమిషాల్లోనే ఏదైనా ప్రత్యేకమైన విషయం వైరల్ కావచ్చు. కొన్ని కోట్ల మందికి ఆ విషయం చేరవచ్చు. ఇప్పుడు మేం చెప్పబోతుంది కూడా అలా వైరల్ అయిన ఓ విషయం గురించే. ఇంతకీ ఏంటది..? కింద చూశారుగా… ఓ యువతి ఫొటోలు… సారీ మహిళ ఫొటోలు… అవును చూసేందుకు అచ్చం 18 ఏళ్ల యువతిలాగే ఉంది ఆమె. అయితే మరి… అసలు ఆమె వయస్సు నిజానికి ఎంతో తెలుసా..? చెబితే నమ్మలేరు. అవును… అసలు ఆమె ఎవరంటే…
ఫొటోల్లో ఉన్న ఈమె పేరు లురే సు. వయస్సు 42 సంవత్సరాలు. అవును, మీరు విన్నది నిజమే. 42 ఏళ్ల వయస్సు వచ్చినా చూసేందుకు అచ్చం 18 ఏళ్ల యవతి లాగే ఉంది కదూ. నిజానికి ఈమె వయస్సు 42 ఏళ్లే. ఈమె చైనీస్ నటి షారోన్ (35)కు అక్క. అయితే ఈమె గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే షారోన్ తన అక్క లురేను మొన్నా మధ్య ఓ ఫంక్షన్‌కు తీసుకెళ్లి తన అక్క అని పరిచయం చేసిందట. దీంతో లురేను చూసిన వాళ్లు షాకయ్యారు. వయస్సు 42 అంటుంది, కానీ చూస్తే 18 ఏళ్ల యువతిలా ఉంది ఏంటబ్బా.. అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
అయితే ఆ ఫంక్షన్‌లో లురేను పలువురు మ్యాగజైన్ల ప్రతినిధులు కూడా చూశారట. దీంతో వారు ఆ ఫంక్షన్ అయ్యాక కొన్ని రోజులకు లురేను ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఫొటోలను మ్యాగజైన్లలో విడుదల చేశారు. ప్రస్తుతం మీరు చూస్తున్నది కూడా అవే ఫొటోలు. చూశారుగా ఈ అమ్మడు 42 ఏళ్ల వయస్సులో కూడా ఎలా ఉందో. అయితే ఇంటర్వ్యూ సందర్భంగా లురే ఏమని చెప్పిందో తెలుసా..? అదేనండీ.. తన బ్యూటీ సీక్రెట్ గురించి ఆమె చెప్పింది. నిత్యం ఆమె కూరగాయలు, పండ్లు మాత్రమే తింటుందట. ఫుల్లుగా నీరు తాగుతుందట. అంతే… అదేనట ఆమె అందం సీక్రెట్..! ఏది ఏమైనా ఇప్పుడు లురే మాత్రం సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Post a Comment