జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన PAYTM


జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది paytm. జియో ఫ్రీ ఆఫర్ ఈ నెల 31తో ముగియనుంది. దీంతో జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైమ్ యూజర్లకు కొన్ని ప్రత్యేక ప్యాక్‌ను కల్పించింది జియో. ఇటీవలే జియో నెట్‌వర్క్‌ను ఆపరేటర్ల జాబితాలో చేర్చింది paytm. పేటీఎం ద్వారా జియో రీచార్జ్ చేసుకోవచ్చని ప్రకటించింది.

ప్రైమ్ యూజర్లకు ప్రకటించిన 303 రూపాయల ప్యాక్‌ను పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకుంటే 381 రూపాయల వరకూ అదనపు లాభాన్ని పొందొచ్చని తెలిపింది paytm. ఈ ప్యాక్‌ను రెండు సార్లు రీచార్జ్ చేసుకుంటే 30 రూపాయల తక్షణ తగ్గింపును paytm ప్రకటించింది. అంతేకాదు ప్రతీ రీచార్జ్‌పై 150 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు పేర్కొంది పేటీఎం. ఈ క్యాష్‌బ్యాక్ లాభాలు పొందాలంటే 499 రూపాయల అన్‌లిమిటెడ్ ప్లాన్‌తో రీచార్జ్ చేయించాల్సి ఉంటుంది. 201 రూపాయల జియో యాడ్ ఆన్ ప్యాక్‌ను ఫ్రీగా పొందొచ్చని ప్రకటించింది paytm. 

No comments