ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా...!!


ప్రస్తుతం ఎంతో మంది భారతీయుల జీవిత విధానంలో తులసి చెట్టు కూడా ఒక భాగం అయిపోయింది. తులసి చెట్టును ఎంతో పవిత్రంగా పూజిస్తారు భారతీయులు. ప్రతి రోజు తులసి చెట్టుకు పూజలు చేస్తారు. పూజల కోసమే కాకుండా ఆరోగ్యం పరంగానూ దీని ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. తులసి ఆకులు తినడం వల్ల ఎన్నో రోగాలు దరిచేరవు. ఇక తులసి చెట్టుకు నమస్కారం చేసి తాకితే మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం. అయితే ఈ మొక్కను ఇంట్లో ఉంచుకున్న వారు మాత్రం కొన్ని నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం .

తులసి మొక్క ఇంట్లో ఉన్న వారు పాటించాల్సిన నియమాలు:

* చాలా మంది తులసి చెట్టు ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచుతుంటారు. అలా చేయడం చాలా తప్పు. అదేవిధంగా తులసి చెట్టును ఎప్పుడు పడితే అపుడు తాకరాదు.
* తులసి ఆకులను ఏకాదశి రోజు, ఆదివారం రోజు, రాత్రి సమయాల్లో మరియు గ్రహణ సమయాల్లో తుంచకూడదు.
* తులసి వద్ద రోజూ దీపం వెలిగించి పూజ చేయాలి.
* ఆకులను తుంచాలి అనుకున్న వారు మొదటగా తులసి అనుమతి తీసుకుని ఆ తర్వాత మాత్రమే ఆకులను తుంచాలి.
* తులసి ఆకులు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తులసి ఆకులు నోట్లో వేసుకుని నమలరాదు. ఎందుకంటే వీటిలోని ఆమ్లం దంతాలకు హాని చేస్తుంది. కాబట్టి నీళ్లలోనూ లేదా టీలోనూ కలిపి తీసుకోవాలి.
* ఆరోగ్యం, మతపరమైన అవసరాలకే మాత్రమే తులసి ఆకులను తుంచాలి. అకారణంగా తుంచడం పాపం.
* ఎండిపోయిన ఆకులు రాలితే వాటిని ఊడ్చకుండా... ఆ మొక్క సమీపంలోనే ఒక గుంత తీసి వాటిని పూడ్చాలి. తులసి మొక్క ఎండిపోతే దాన్ని నదీ జలాల్లో లేదా చెరువులోగానీ వేయాలి. అలాగే ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది కాదు. 

No comments