ఒక అమెరికా అతను అడిగిన ప్రశ్న ఇది - మనోళ్లు చెప్పిన సమాధానాలు చూస్తే
ఒక అమెరికా అతను అడిగిన ప్రశ్న ఇది!
" భారతీయులు టాయిలెట్‌కి వెళ్లిన తరువాత పేపర్ తో తుడుచుకోకుండా చెండాలంగా చేతితో కడుక్కుంటారెందుకు ? "
ఈ ప్రశ్న కోరా.కామ్ (www.quora.com) లో పోస్ట్ చేసాడు దీంతో మనోళ్ళకి ఎక్కడలేని కోపం ఉక్రోషం వచ్చేసింది. మనోళ్లు చెప్పిన సమాధానాలు చూస్తే అమెరికన్ల మైండ్ అదిరిపోవాల్సిందే.
సమాధానం - 1
" అదేం అసహ్యమైన పని కాదు. ఇంకా చెప్పాలంటే అదే చాలా శుభ్రమైన పని. ఒకవేళ మీకు రెండు కల్చర్స్ కలపాలనిపిస్తే ముందు కడిగి తరువాత తుడుచుకోండి. "
సమాధానం - 2
" అయినా మీరు పళ్లు బ్రష్ తో తోముకుని, నీటితో ఎందుకు కడుగుతారు. పేపర్‌తో పళ్లు, చిగుళ్లూ తుడిచేసుకోవచ్చు కదా. దాని వల్ల తక్కువ అసహ్యం కదా. చివరగా చెప్పాలంటే, పొద్దున్నే ఏ పైప్ స్టార్టింగ్ పాయింట్ బ్రష్ తో క్లీన్ చేస్తామో అదే పైప్ ఎండింగ్ పాయింట్ కూడా వాటర్ తో క్లీన్ చేస్తాం అన్నమాట. "
సమాధానం - 3
" ఎందుకంటే మాకు కారం గా ఉండే ఆహారం అంటే ఇష్టం. మరి పేపర్ అయితే ఆ కారానికి కాలిపోతుంది కదా. అందుకని పేపర్ వాడం. "
సమాధానం - 4
" ఓ పని చేయి. నువ్వు స్నానం చేయడం మానేసి, టాయిలెట్ పేపర్‌తో ఒళ్లు తుడుచుకో. మేము మాత్రం కడుక్కున్న తరువాత చేయి శుభ్రంగా కడుక్కుంటాం. "
సమాధానం - 5
" ఓ పని చేయి నువు ముఖానికి చాకొలేట్ రాసుకో. ఓసారి దాన్ని టిష్యూ పేపర్ తో తుడు. మరోసారి నీటితో కడుగు తేడా నీకే తెలుస్తుంది. "
సమాధానం - 6
" నీ ఒంటి మీద ఇంకెక్కడన్నా అది అంటుకుంటే ఏం చేస్తావు. పేపర్‌తో తుడుస్తావా? కడుగుతావా? "
సమాధానం - 7
" మీరు ఓ ప్లేటులో కూరలు అవీ పెట్టుకుని శుభ్రంగా తినేయండి. భోజనం అయిపోయాక ఆ ప్లేటును కళ్లు మూసుకుని ఓ టవల్‌తో శుభ్రం చేయండి. ప్లేటు వైపు చూడవద్దు. కావాలంటే మధ్య మధ్యలో టవల్ కి అంటిన మరకలు చూసి ప్లేటు శుభ్ర పడిందో లేదో చూడొచ్చు. టవల్ చూసి, టవల్ కి అంటిన మరకలు చూసి ప్లేటు శుభ్ర పడిందో లేదో నిర్థారించుకోండి. "
" ఇప్పుడు సాయంత్రం భోజనానికి మళ్లీ అదే ప్లేటు వాడి చూడండి. వాడగలరా? కేవలం కళ్లు మూసుకుని టవల్‌తో తుడిస్తే ప్లేటు శుభ్ర పడుతుందా? "
" ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెబుతా.."
" అదే ప్లేటును అలాగే కళ్లు మూసుకుని షింక్ కింద పెట్టండి. రెండే నిమిషాలు స్పీడుగా నీళ్లు వచ్చే చోట పెట్టండి. ఇప్పుడెలా ఉంది ప్లేటు ? "
ఈ సమాధానాలు చదివిన తర్వాత ఇంకెవ్వడు కూడా భారతీయ అలవాట్లు గురించి మాట్లాడే సాహసం చేయరు.
Read:
Post a Comment