చదువుకుంటాడని తమ్ముడిని ఇంట్లో పెట్టుకుంటే..


సుదర్శన్‌, అర్పితలకు రెండు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. ఇంకా పిల్లలు కాలేదు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన వీరు హైదరాబాద్‌కు పని కోసం అంటూ వచ్చారు. ఒక నిర్మాణ సంస్థలో సుదర్శన్‌ గుమస్తాగా జాయిన్‌ అయ్యాడు. జీవితం సాఫీగా సాగుతుంది. ఆ సమయంలోనే ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకున్న సుదర్శన్‌ తమ్ముడు ఆదర్శ్‌ గేట్‌ కోచింగ్‌ అంటూ హైదరాబాద్‌ వచ్చాడు. హాస్టల్‌, రూం ఎందుకు డబ్బు వృదా మాతోనే ఉండూ అంటూ సుదర్శన్‌ మంచి మనసుతో తమ్ముడు ఆదర్శ్‌ను ఇంట్లోనే ఉంచుకున్నాడు.

కొన్ని రోజులు గడిచాయి. అర్పిత, ఆదర్శ్‌ల ప్రవర్తనలో సుదర్శన్‌కు మార్పు కనిపిస్తుంది. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు అనిపించింది. అయితే అలా ఆలోచించడం తప్పు అని తనకు తాను సర్దిచెప్పుకొచ్చాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు ఇద్దరు బయట చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటూ కనిపించారు. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం నడుస్తుందని అనుమానం వచ్చింది. దాన్ని ఎలాగైనా బయట పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే ఒకరోజు ఇంట్లోనే ఒక మూలన సెల్ ఫోన్ పెట్టి వదిన, మరిది చేస్తున్న రంకును రికార్డ్‌ చేశాడు. ఇద్దరి బండారాన్ని కుటుంబ పెద్దల ముందు బయట పెట్టి అర్పితకు విడాకులు ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాడు.

No comments