బాహుబలి రిలీజ్‌ ఐతే థియేటర్లను తగులబెడుతారట!



టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం రెండవ పార్ట్‌ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. హిందీతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయయాలని భావిస్తున్నారు. మొదటి పార్ట్‌ను తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళంలో విడుదల చేయడం జరిగింది. ఈసారి కన్నడంలో కూడా డబ్బింగ్‌ చేసి విడుదల చేయాని నిర్ణయించారు. అందుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

కన్నడ సినీ పరిశ్రమ రూల్‌ ప్రకారం ఇతర భాష చిత్రాలు కన్నడంలో డబ్బింగ్‌ అవ్వడం నిషేదం. కన్నడ సినిమాలను రక్షించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా ఏ సినిమా కూడా కన్నడంలో డబ్బింగ్‌ అయ్యింది లేదు. నేరుగా విడుదల అవ్వాల్సిందే. అయితే తమిళంలో ప్రస్తుతం అజిత్‌ నటించిన ఒక సినిమాను కన్నడంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం డబ్బింగ్‌ కూడా పూర్తి అయ్యింది. ఈ సమయంలోనే సీనియర్‌ నటుడైన జగ్గేష్‌ సంచలన ట్వీట్స్‌ చేశారు.

డబ్బింగ్‌ చిత్రాలు ఏ థియేటర్‌లో ఆడినా కూడా కన్నడ ప్రేక్షకులు ఆ థియేటర్లను కాల్చేయడం ఖాయమని, అందుకే డబ్బింగ్‌ ఆలోచన చేయవద్దంటూ అజిత్‌ చిత్ర నిర్మాతలను హెచ్చరించాడు. దాంతో కన్నడంలో ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ డబ్బింగ్‌ అవ్వడం అసాధ్యమే అని తేలిపోయింది. కన్నడంలో తెలుగు వర్షన్‌ లేదా హిందీ వర్షన్‌ను విడుదల చేసి, మలయాళం మరియు తమిళంలో డబ్బింగ్‌ చేసే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెల చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. 

No comments