రానా - ధునుష్ .. ఇద్దరితో ఎఫైర్ నడిపిన త్రిష



రానా దగ్గుబాటికి – త్రిషకి మధ్య ఏదో ఉందని మనం కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ఎన్నిసార్లు అడిగినా, తమిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని, ఇంకేమి లేదని చెప్పుకుంటూ వచ్చారు ఈ ఇద్దరు. కాని ఎక్కడో ఓ మూల, అందరికి అనుమానమే. ఎందుకంటే వీరిద్దరు ఎంతో అంటే ఎంతో సన్నిహితంగా ఉంటారని, ఓ స్నేహితుల మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యం కన్నా ఎక్కువే వీరి మధ్య ఉంటుందని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటారు.
అందులో నిజానిజాలు మనకి తెలియవు కాని, వీరి మధ్య ఎఫైర్ నడిచిన మాట వాస్తవమే అని సింగర్ సుచిత్ర చెబుతోంది. సుచిత్ర ఎవరు అని అంటారా? బిజినెస్ మెన్ లో సార్ ఒస్తారా అనే పాట పాడింది చూడండి .. ఆ అమ్మాయి. అసలు తనకు ఏమైందో తెలియదు కాని, తమిళ సినిమాలోని చీకటి కోణాల్ని ఒకదాని తరువాత ఒకటి బయటపెడుతోంది.

త్రిషకి కేవలం రానాతోనే కాదు అంట, ధనుష్ తో కూడా ఎఫైర్ ఉందని, దానికి సాక్ష్యంగా ఓ ఫోటో కూడా రివీల్ చేసింది. అసలు ఎవరికి అంతుచిక్కని విషయం ఏమిటంటే, మరో ఇద్దరు హీరోయిన్ల నగ్నసత్యాలే కాదు, నగ్నచిత్రాలు కూడా లీక్ చేసింది సుచిత్ర.
సుచిత్ర మతిస్థిమితం బాగా లేదని కొందరు, లేదు సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది, ఎవరో సుచిత్ర పేరు వాడుకోని ఇదంతా చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు కాని, రానున్న నాలుగైదు రోజుల్లో, తమిళ సినిమాలోని పెద్ద పెద్ద పేర్ల బండారాలే బయటపడనున్నాయి.

No comments