పదవులకే వన్నె తెచ్చిన మహానుభావుడు..నేడు వి.వి.గిరి జయంతి


పదవులకే వన్నె తెచ్చిన మహానుభావుడు..
(నేడు వి.వి.గిరి జయంతి)
(స్వతంత్ర భారత్ కీ జై !!!)
వి.వి.గిరిగా ప్రఖ్యాతులైన వరాహగిరి వెంకట గిరి నేటి ఒడిషాలోని బరంపురంలో 1894 ఆగస్టు 10న జన్మించారు. న్యాయశాస్త్ర విద్యకోసం బ్రిటన్ వెళ్లారు. అక్కడే మహాత్మాగాంధీని కలిసి ఆయన సలహా మేరకు బ్రిటన్ రెడ్ క్రాస్ లో చేరారు. అక్కడి విద్యార్ధి సంఘానికి నాయకత్వం వహించారు. 1916లో భారత్ కు తిరిగివచ్చి న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు.
భారత జాతీయోద్యమం ఒకవైపు , కార్మిక ఉద్యమం మరోవైపు సాగుతున్న దశలో రెండింటిలో సమన్వయంతో పనిచేశారు. కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేస్తూ న్యాయవాద వృత్తిని వదిలి జాతీయోద్యమానికి అంకితమయ్యారు.
1934-37 మధ్యకాలంలో భారత శాసనసభ సభ్యునిగా కార్మిక సమస్యలపై గళమెత్తారు. 1927లో జెనీవీ అంతర్జాతీయ కార్మిక సమావేశంలో 1931-32 లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మికుల ప్రతినిధిగా పాల్గొన్నారు.
1937 లో రాజాజీ మంత్రివర్గంలో, 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో పనిచేశారు. 1952లో లోక్ సభకు ఎన్నికై 1954లో కేంద్ర కార్మిక మంత్రిగా చేశారు. 1957-67 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్, కేరళ, మైసూర్ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు.
1967 లో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1969-74 మధ్య భారత నాలుగవ రాష్ట్రపతిగా ఎన్నికై పదవికి వన్నె తెచ్చారు. 1976 లో భారతరత్న అవార్డుతో సత్కారం పొందారు. వి.వి.గిరి 1980 జూన్ 24న కన్నుమూశారు.

https://www.facebook.com/BhaaratToday

No comments