బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన క్విట్ ఇండియా ఉద్యమం



క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు..
రెండవ ప్రపంచ యుద్ధంతో సతమతమవుతున్న బ్రిటీష్ ప్రభుత్వానికి గాంధీజీ నాయకత్వంలో
ఉద్యమాలు మరింత దిగులు పుట్టించాయి. యుద్ధం ముగిసిన తర్వాత భారతీయుల కోర్కెల
గురించి సానుకూలంగా స్పందిస్తామని బ్రిటన్ రాయబారం పంపింది.

ఆ ప్రతిపాదనలు ‘దివాలా తీసేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకుపై ఇచ్చిన చెక్కులా’ ఉన్నాయని గాంధీజీ
వారిని ఎద్దేవా చేశారు.
భారత్ ను వదిలి వెళ్లండని కోరుతూ ..1942 ఆగస్టు 8న కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సభ్యులతో గాంధీజీ ఉద్యమాన్ని రచించారు.
‘క్విట్ ఇండియా’ పేరున 1942 ఆగస్టు 9 నుండి ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ ఉద్యమంలో ‘విజయమో..వీరస్వర్గమో’ అనే మంత్రాన్ని దేశప్రజలకు ఉపదేశించారు.
ఆగస్టు 9 ఉదయానికి గాంధీ, నెహ్రూలతో సహా ప్రముఖ నాయకుల్ని అరెస్టు చేశారు.
నాయకత్వం లేక ప్రజలు తీవ్రంగా ఉద్యమించారు. హింసాత్మక విధ్వంసక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం దమన నీతితో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని అణచివేసింది.


source:http://www.teluguwishesh.com/anveshana/234-anveshana/24452-quit-india-movement.html

No comments