ఫ్లాష్ ఛానెల్ అధిపతిగా మహేష్ !


చిరంజీవి నాగార్జున జూనియర్ లకు షాక్ ఇస్తూ నిన్న జరిగిన తనపుట్టిన రోజునాడు మహేష్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. నిన్నటితో మహేష్ బాబు కూడా సొంతంగా ఛానల్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి. తన సినిమాల ఎంపికలో చాలా డిఫెరెంట్ గా వ్యవహరించే మహేష్ ఈ ఛానల్ విషయంలో కూడ చాల వ్యూహాత్మకంగా మరియు వినూత్నంగా వ్యవహరిస్తున్నాడు.

ఆ ఛానల్ మరేమిటో కాదు ప్రిన్స్  యూట్యూబ్ చానల్. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. యుట్యూబ్ లో సొంతంగా ఓ ఛానల్ ప్రారంభిస్తున్నాడు. మహేష్ నటించిన లేటెస్ట్ సినిమాల వర్కింగ్ స్టిల్స్ ట్రైలర్స్ తో పాటు రకరాకాల మ్యూజిక్ ఆల్బమ్స్ కూడ తయారు చేయించి ప్రిన్స్ ఛానల్ పేరుతో యూట్యూబ్ లో అప్ లోడ్ చేయించబోతున్నాడు మహేష్. 

అంతేకాదు మహేష్ లైఫ్ కు సంబంధించిన చాలా అరుదైన ఫోటోలు కూడ ఈ ఛానల్ ద్వారా మహేష్ తన అభిమానులకు అందుబాటులో ఉంచుతాడట. ఈవార్తలు ఇలా ఉండగా నిన్నటితో ముగిసిన వీకెండ్ తో ‘శ్రీమంతుడు’ కలెక్షన్స్ ఊహించిన స్థాయి కంటే భారీ స్థాయిలో ఉండటమే కాకుండా ‘శ్రీమంతుడు’ పేరుకు తగ్గట్టుగా టాలీవుడ్ లో ‘బాహుబలి’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు దక్కించుకోవడంలో ఎటువంటి సందేహం లేకుండా  ‘శ్రీమంతుడు’ హవా నిన్న మూడో రోజు కూడా కొనసాగింది. 

సోమ, మంగళవారాలకు సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పీక్స్‌లో ఉన్న నేపధ్యంలో ఆగష్టు 15 వరకు ఇదే హవా కొనసాగి ‘శ్రీమంతుడు’ కలెక్షన్స్ సునామి సృస్టించడం ఖాయం అనే మాటలు వినిపించడమే కాకుండా అన్నీ కలిసి వస్తే ‘శ్రీమంతుడు’ కూడ వందకోట్ల సినిమాగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

source: apherald.com

No comments