RGV: శ్రీమంతున్ని మెచ్చుకుంటూ..బాహబలిపై పంచ్..!


సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ  సోషల్ మీడియా ద్వారా తనదైన రీతిలో రెచ్చిపోయే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మనసులో ఉన్న భావాన్ని నిక్కచ్చిగా, కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. ఇవి కొన్ని సార్లు ఆయనపై విమర్శలు వచ్చినా అవేవీ పట్టించుకోడు.. తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ‘శ్రీమంతుడు’ చిత్రం గురించి తన స్పందన తెలియజేశాడు. నేడు విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రం అద్భుత విజయం సాధించిందని అన్నారు.

చిత్రంలో మహేష్ నటన అద్భుతమని, బాహుబలి సందడి పూర్తి కాకుండానే, ఆ చిత్రం విజయం ప్రభావం ఎంతమాత్రమూ లేకుండా మరో గొప్ప విజయం సాధించిన సినిమా ‘శ్రీమంతుడు’ రూపంలో వచ్చిందని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.సింపుల్ అండ్ ప్లేన్ మూవీ అంటూ అకాశానికి ఎత్తేసారు వర్మ. సినిమా చూస్తున్నంత సేపు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్లు అనిపించందని.. మన నేటివిటీకి తగ్గ అందమైన లోకేషన్లు.. గ్రామీణ వాతావరణ చాలా అద్భుతంగా చిత్రీకరించారని అన్నారు.

బాహుబలి లాంటి భారీ సినిమా చూసిన తర్వాత.... శ్రీమంతుడు సినిమా సింప్లిసిటీతో మనసుకు హత్తుకుందని, సినిమా అద్భుతంగా ఉదంటూ వర్మ ట్వీట్ చేసారు.వందల కోట్లు ఖర్చు, సంవత్సరాల తరబడి శ్రమ లేకుండా అంటూ బాహుబలిపై పంచ్ వదిలాడు.. ఇక  సాధారణ కథాంశం, అందమైన చిత్రీకరణ, మహేష్ అందం చిత్రాన్ని ఘన విజయం దిశగా నడిపించిందని తెగ మెచ్చుకుంటూ ట్విట్ చేశాడు

source:apherald.com

No comments