మృత్యు దేవత ఎలా ? ఎందుకు సృష్టించబడింది? మానవుడి మరణానికి కారణం ఏంటి?


సృష్టి ప్రారంభం అయినపుడు మానవులకి మరణం లెదు! దీంతో జనాభా బాగా పెరిగిపోయారు! మనకి 100నూరేళ్ళ జీవితం ఇచ్చి బ్రతకండి అంటేనే నానా రచ్చ చేస్తున్నాం! అసలు చావే లేకపోతే ఊరుకుంటామా? దేవతల మీద తిరుగుబాటు చేశారు! అప్పుడు బ్రహ్మ దిగివచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు! కాని ఎవరూ బ్రహ్మ మాట వినకుండా ఆ కమల సంభవుడు మీదకి వెళ్ళారు! ఆ సంఘటనతో కోపగించిన బ్రహ్మ ముఖం నుండి అగ్ని చెలరేగి లోకాలన్నీ దహించి వెయ సాగింది! ఇంతలో ముక్కంటి అక్కడికి వచ్చి బ్రహ్మదేవ ఏమిటి ఈ విపత్తు! లోకాలు తగలబడి పోతున్నాయి! అగ్నిని ఉపసంహరించు! లోకాలని సృష్టించే నువ్వే నాశనం చేస్తే ప్రళయ రుద్రుడిని నేను ఏమి చేయాలి? కోపం వుపశమించుకొ అనగానే బ్రహ్మ అగ్నిని చల్లార్చి ఈ జనులు చావులేక పరమ మూర్ఖులుగా తయారవుతున్నారు అని అనుకోగానే తన కోపం నుండి వికృత రూపం గల ఒక ఆకారం పుట్టింది! ఎర్రటి కళ్ళు! వాడి వాడి కోరలు, నల్లని రూపం! ఆకాశమంత ఎత్తు! పరమ భయంకర రూపంతో పుట్టుకొచ్చింది! ఆమె ''మృత్యు దేవత''.

బ్రహ్మ, ముక్కంటి ఆ మృత్యు దేవతకి అన్ని క్రియలు జరిపి మానవులని అంతం చేయమని ఆదేశం ఇచ్చారు! ఆ మృత్యువు భోరుమని ఏడ్చి అయ్యో నాకింత ఖర్మ ఏల? చక్కగా పిల్లా పాపలతో, తల్లితండ్రులతో, బంధు మిత్రాధులతో సకల సంతోషాలతో తులతుగుతున్న మనుషుల్ని నేను ఎలా చంపను? వాళ్ళు నన్ను తిట్టి శాపనార్ధాలు పెట్టరా? ఈ పని నేను చేయలేను! ఇంద్రుడికి స్వర్గాన్ని, అగ్నికి యజ్ఞాలు, ఇలా అందరికి మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చి నాకు మనుషులని చంపే కిరాతకమైన పనా? బాబోయి నాకొద్దు ఈ పని అని వల వల ఏడ్చింది! అప్పుడు బ్రహ్మ ఈ పని మేము చెప్తున్నాం కాబట్టి నీకు ఎలాంటి పాపమూ అంటదు! కనుక నువ్వు వెళ్లి చెప్పిన పని నిర్విగ్నంగా పూర్తిచేయి! అని బ్రహ్మ , శివుడు ఇద్దరు మృత్యు దేవతకి సర్ది చెప్పి ఎవరి లోకాలకి వారు వెళ్ళిపోయారు! 

No comments