సర్ధార్ మూవీకి హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకురన్నది వీళ్ళే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్స్ అంటే చిన్న విషయం ఏ మాత్రం కాదు.
ప్రస్తుత పరిస్థితుల్లో టాప్ హీరోల సరసన హీరోయిన్ ఆఫర్ దొరకాలంటే చాలా
కష్టపడాల్సి ఉంటుంది. అటువంటిది ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ ఛాన్స్
వరిస్తే, వారు మాత్రం చాలా లైట్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన
వివరాల్లోకి వెళితే, ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్ బ్లస్టర్ తర్వాత
పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తోన్న సినిమా ‘సర్దార్ గబ్బర్
సింగ్’.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ పేరుతో రూపొందుతోన్న ఈ కొత్త సినిమాకు ‘పవర్’ సినిమా ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది మొదటి నుండి సస్పెన్స్ గానే ఉంది. అయితే తాజాగా ఈ విషయమై సినిమా యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
హీరోయిన్ గా కాజల్ ని ఎంచుకున్నట్టు చెప్పుకొచ్చింది. నిజానికి కాజల్ కి ముందు, ముగ్గురు టాప్ హీరోయిన్స్ ని చిత్ర యూనిట్ సంప్రదించింది. ఆ ముగ్గురు సైతం పవన్ సరసన నటించటానికి సమయం లేదంటూ చెప్పుకొచ్చారు. వారిలో మొదట హీరోయిన్ గా అనుష్క ఉంది.
అనుష్క జీరో సైజ్ మూవీ షూటింగ్ చేస్తుండగా తనతో సంప్రదింపులు జరిపారు. తమిళంలో రెండు మూవీలను ఒప్పుకున్నందున, పవన్ కి కాల్షీట్స్ ఇవ్వలేనని వివరణ ఇచ్చుకుంది. అలాగే తమన్నని, శ్రుతిహాసన్, సమంతతో సహా చిత్ర యూనిట్ సంప్రదించగా అందరూ కాల్షీట్స్ ఇవ్వలేమని చెప్పుకొచ్చారు. చివరకు ఆ ఛాన్స్ కాజల్ ని వరించిందని ఫిల్మ్ నగర్ సమాచారం.
source:apherald.com

Post a Comment