హాట్ టాపిక్ గా మారిన చిరంజీవి రెస్టారెంట్ వార్తలు !
మెగాస్టార్ నట వారసుడిగా టాలీవుడ్ సినిమారంగలో ఇప్పటికే తనకంటూ ఒక ఇమేజ్
ఏర్పరుచుకున్న రామ్ చరణ్ చిరంజీవి ఇమేజ్ ని తన వ్యాపారాలకు కూడ
వాడుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ
ట్రూ జెట్ విమానాల ద్వారా విమాన రంగం బిజినెస్ లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్
త్వరలో రెస్టారెంట్ వ్యాపారంలోకి కూడ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాన్ని లీక్ చేసాడు. మన ఇరు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయబోయే ఈ రెస్టారెంట్స్ కు ‘చిరంజీవి దోసె’ అనే పేరును కూడ పెట్టే విషయాన్ని చరణ్ ఆ ఇంటర్వ్యూలో సూచనా ప్రాయంగా తెలియచేసాడు.
ఇప్పటికే ఈ దోసె పేరుకు పేటెంట్ ను కూడ చరణ్ తీసుకొచ్చిన నేపధ్యంలో ఇక త్వరలోనే మన ఇరు రాష్ట్రాలలోను చిరంజీవి దోస రెస్టారెంట్స్ హడావిడి కనపడబోతోంది అనుకోవాలి. మొన్న జరిగిన చిరంజీవి షష్టి పూర్తి డిన్నర్ లో కూడ ప్రధాన ఆకర్షణగా చిరంజీవి దోస స్పెషల్ కౌంటర్ నిలిచిన విషయo తెలిసిందే.
ఇదే ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ తాను చేసే ప్రతి సాహసం వెనుక తన తండ్రి చిరంజీవి తాను వెనుక ఉన్నాను అని ప్రోత్సహిస్తూ ఉంటాడని అందువల్లనే తానూ ఇన్ని సాహసాలు చేయగలుగుతున్నాను అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు చరణ్..
source:apherald.com

Post a Comment