త్వరలో మహేష్ తో పవన్..!!
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ మూవీస్ బాగానే వస్తున్నాయి. గోపాల గోపాల సినిమాలో వెంకటేష్, పవన్ కళ్యాన్ ఇద్దరు అగ్రహీరోల సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతే కాదు ఈ మద్య కాలంలో పెద్ద సినిమాలకు ఆడియో ఫంక్షన్లలో హీరోలు కూడా గెస్ట్ గా వస్తున్నారు. తమకు ఎంత ఇమేజ్ ఉన్నా పక్క హీరో గురించి గొప్పగా పొగిడేస్తూ.. వాళ్ల సినిమాలు బాగా ఆడాలని మనస్పూర్తిగా కోరకుంటున్నారు. ఇక పెద్ద సినిమాలు రిలీజ్ కు ఓ పది రోజుల ముందు నుంచి విపరీతమైన ప్రమోషన్ వర్క్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘శ్రీ మంతుడు ’ సినిమా గురించి చిత్ర యూనిట్ ఇప్పటికే హంగామా మొదలు పెట్టింది. టీవి చానల్స్ లో ఇంటర్వూల ద్వారా బాగా సందడి చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ట్విట్టర్ లో చాట్ సెషన్ పెట్టాడు. అభిమానుల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తున్న మహేష్ టైం లైన్ లో ఒక ప్రశ్నకు అధిక ప్రాముఖ్యత లభించింది. ఈ సందర్భంగా తన మనసులో మాట అన్ని చాలా ఓపిగా చెప్పాడు ప్రిన్స్.
ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు మల్టీ స్టారర్ మూవీ చేయాలనుకుంటున్నారా అయితే పవన్ కళ్యాన్ తో చేయడం పై మీ ఉద్దేశ్యం అని అడగారు దీనిపై స్పందిస్తూ తప్పకుండా ఎందుకు చేయకూదు మంచి కథ, మంచి డైరెక్టర్ ఉంటే ఈ కాంబినేషన్ తనకు ఇష్టమే అని చిన్న పాజిటీవ్ హింట్ ఇచ్చాడు మన మహేష్. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రుతి హాసన్ జంటగా శ్రీమంతుడు ఆగస్టు 7న రాబోతుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/92839/srimanthudu-movie-mahseh-babu-tollywood-movies-kor/
Post a Comment