పవన్ బర్త్ డే కు సూపర్ గిఫ్ట్ ..!!


తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ ఒక ప్రభంజనం.. ఆయనంటే అభిమానం చాటుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు... అందులో ముఖ్యంగా మ్యూజిక్ దర్శకులు  బాబా సెహగల్  ఈ ఇద్దరికి పవన్ కళ్యాన్ అంటే చాలా ఇష్టమట. గబ్బర్ సింగ్ లో దెఖో దెఖో గబ్బర్ సింగ్ అంటూ ఊర్రూతలూగించిన బాబా సెహగల్ ఇప్పుడు ఓ వెరైటీ గిఫ్ట్ పవన్ బర్త్ డే కి ఇవ్వబోతున్నాడట. ఇక బాలీవుడ్ ప్రయివేట్ ఆల్బామ్స్ చేసుకునే బాబా సెహగల్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి చాన్సులు వస్తున్నాయి.

గుణశేఖర్ తీసిన రుద్రమదేవి సినిమాలో కూడా నటిస్తున్నాడు. మనోడు ఇప్పటికే మంచి మ్యూజిక్ డైరెక్టర్ , సింగర్ సో... తన పేవరేట్ హీరో కు బంపర్ గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట బాబా సెహగల్. ఆ మద్య పవర్ స్టార్ మీద ఓ పాటను కంపోజ్ చేసారు. అప్పట్లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాన్ బర్త్ డేకి మంచి పాట   ‘ఎ పవర్ సాంగ్’ అనే టైటిల్ తో సరికొత్త సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు సైగల్.

పవన్ కళ్యాన్ అంటే అభిమానం చాటుకునే వారు ఒక్కక్కరు ఒక్కో రకంగా చాటుకుంటారు రాజకీయంగా కూడా ఈయన బాగానే దూసుకు పోతున్నారు. ఇప్పుడు జన సేన కార్యకర్తలు పవన్ పుట్టిన రోజున అన్నదానాలు, రక్తదానాలు, పాలాభిషేకాలు,పొర్లు దండాలు రక రకాలు గా తమ అభిమానాన్ని చాటుకుంటే బాబా సెహగల్ మాత్ర తనకు తెలిసిన విద్యతోనే అదరగొట్ట బోతున్నాడన్న మాట. మరి త్వరలో బాబా సెహగల్ తన అభిమానాన్ని ఎలా చాట బోతున్నాడో వేచి చూడాల్సిందే.
source:http://www.apherald.com/Movies/ViewArticle/92883/baba-sehgal-pawan-kalyan-birth-day-gift-songs-musi/

No comments