రాజమౌళి-మహేష్ ల సీక్రెట్ లీకైంది
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ శ్రీమంతుడు మూవీ త్వరలోనే రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇదిలా ఉంటే, మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కి సంబంధించిన ఓ సీక్రెట్ ఇప్పుడు బయటకు తెలిసింది.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే,ప్రముఖ నిర్మాణ సంస్థ 14రీల్స్, శ్రీనువైట్ల, మహేశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దూకుడు’ చిత్రం బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. మళ్లీ అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆగడు’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మరోసారి మహేశ్‌తో ఓ సెన్సేషనల్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు 14 రీల్స్ అధినేత అనిల్ సుంకర తెలిపారు.
శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్ లో మహేష్ హీరోగా ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ రాబోతుంది అంటూ సంకేతాలు వచ్చాయి. అయితే ఆ భారీ బడ్జెట్ మూవీకి నిర్మాతగా అనిల్ సుంకర ఉండబోతున్నారనే క్లియర్ టాక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అనిల్ సుంకర, మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ కి సంబంధించిన అండర్ గ్రౌండ్ వర్క్ ఇప్పటికే స్టార్ అయిందని అంటున్నారు.
మొత్తంగా ఇంత కాలం సస్పెన్స్ తో ఉన్న రాజమౌళి,మహేష్ బాబు కాంబినేషన్ మూవీకి నిర్మాత, ఇప్పుడు తెలిసిపోవడంతో... ఇక ఈ కాంబినేషన్ కి బడ్జెట్ 100 కోట్ల..200 కోట్లా..300 అంటూ ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/92712/keeravani-bollywood-baahubali-baahubali2-baahubali/
Post a Comment