పవన్ ‘సర్ధార్’ షూటింగ్ లో హంగామా..!!


తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ అంటే ఓ ప్రత్యేకత ఉంది.. మెగాస్టార్ తమ్ముడిగా వెండితెరకు పరిచయం అయినా.. తనకంటూ ఓ ప్రత్యేక మ్యానరిజాన్ని చూపించి అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు . ఈయన నటించిన జల్సా,గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ మళ్లీ సినిమా తెరపై కనిపించి చాలా సమయం పట్టింది. మద్యలో గోపాల గోపాల చిత్రంలో సెకండ్ ఆఫ్ నుంచి కనిపించి అలరించారు.

ఇప్పుడు బాబి దర్శకత్వంలో ‘సర్ధార్’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూణే లో జరిగింది కానీ పవన్ ఆ షూటింగ్ లో పాల్గొనలేదు. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్  (జులై 29) హైదరాబాద్ లో ప్రారంభం అయింది.  కంటిన్యూగా జరుగుతున్న ఈ షెడ్యూల్ కు కొనసాగింపుగా నైట్ షూట్ ప్లాన్ చేసారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రాత్రిపూట ఈ షూటింగ్ జరగనుంది. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ షూట్ లో పాల్గొననున్నారు. ఈ సీన్స్ తర్వాత గుజరాత్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఆ మద్య 'సర్దార్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచి రెస్పాన్స్ వచ్చిందీ ఫస్ట్ లుక్ కి.


ఇక పవర్ కళ్యాన్ గబ్బర్ సింగ్ సిమాలో ఖాకీ డ్రెస్ లో అదరగొట్టాడు.. పోలీస్ అంటే ఇంత పవర్ ఫుల్ గా ఉంటాడా అన్నట్టుగా పవన్ నటించాడు. సర్దార్ లో మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తబోతున్నాడు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు బాధ్యతలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించారు

source:http://www.apherald.com/Movies/ViewArticle/93488/sardaar-pawan-kalyan-bobby-gabbar-singh-2-tollywo/

No comments