బాహుబలి మరణం పై రాజమౌళి వివరణ !
‘బాహుబలి’ విడుదలై నెలరోజులు గడిచిపోయినా ఈ సినిమా క్లైమాక్స్ లో కట్టప్ప ‘బాహుబలి’ ని ఎందుకు చంపాడు అన్న విషయానికి సంబంధించి ఒక జీవిత సమస్యలా ఇప్పటికీ చాలామంది ఆలోచిస్తూనే ఉన్నారు. కొందరైతే వారి తెలివి తేటలకు పదును పెట్టి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న విషయమై రచయితలుగా కూడ మారిపోయి రకరకాల కథనాలను సృష్టించారు.
నిన్న ఒక ప్రముఖ ఛానల్ రాజమౌళిని అతిధిగా పిలిచి కాలేజీ విధ్యార్దుల చేత రాజమౌళిని ఇంటర్వ్యూ చేయించారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి కూడ చాల ఉత్సాహంగా పాల్గొంటూ అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉండగా రాజమౌళి భార్య రామారాజమౌళి ఆ ఛానల్ ప్రోగ్రామ్ లోకి ఎంటరై తాను ఎక్కడకు వెళ్ళినా, తాను ఇంట్లో ఉన్నా అనేక మంది వ్యక్తిగతంగాను ఫోన్స్ లోను తనను వెంటాడుతూ అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ తనను వేధిస్తున్నారని అందువల్ల ఆ సీక్రెట్ ను ఒకసారి బహిరంగంగా చెప్పమని నవ్వుతూ రాజమౌళిని ప్రశ్నించింది రామరాజమౌలి.
అయితే ఈ ప్రశ్నకు ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా రాజమౌళి వెంటనే సమాధానం ఇచ్చాడు. కట్టప్ప మాహిష్మతి రాజ్య సింహాసనం కన్నా, శివగామి కన్నా, భల్లాల దేవుడికన్నా మరో వ్యక్తికి అత్యంత విశ్వాస పాత్రుడని ఆ వ్యక్తి ఎవరో ఆలోచిస్తే వెంటనే సమాధానం దొరుకుతుందని సమాధానం ఇచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నవారిని ఆలోచించమని ఎదురు ప్రశ్న వేసాడు.
అయితే కొద్ది క్షణాల పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఒకవైపు ఒకరికొకరు చూసుకుంటూ అయోమయంలో పడిపోయారు. వెంటనే రాజమౌళి నవ్వుతూ ‘బాహుబలి’ సినిమాకు కర్తా, క్రియా అన్నీ తానే కాబట్టి కట్టప్ప తనకు అత్యంత విశ్వాస పాత్రుడని అందువల్ల తాను చంపమని చెప్పగానే మరో మారు మాట లేకుండా తన ఆజ్ఞను శిరసా వహించాడు అంటూ ఆకార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ నవ్వించాడు జక్కన్న..
source:http://www.apherald.com/Movies/ViewArticle/93493/RAJAMOULI-CLARIFICATION-ON-BAHUBALI-DEATH/
Post a Comment