ప్రతాప రుద్రుడుగా మహేష్ కనిపించబోతున్నాడా ..?!!
తెలుగు ఇండస్ట్రీలో దర్శక, నిర్మాత గుణశేఖర్, సూపర్ స్టార్ మహేష్ బాబుకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. మహేష్ బాబుకి గుణశేఖర్ దర్శకత్వంలో ‘ఒక్కడు’ లాంటి బ్లాక్ బ్లస్టర్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన ‘అర్జున్’ సినిమా కమర్షియల్ గా హిట్ కాకున్నా మహేష్ బాబుకి అద్భుతమైన పేరు తెచ్చిపెట్టింది. ఒక అక్కకోసం తమ్ముడు పడే ఆవేదన ఈ చిత్రంలో అద్భుతంగా చూపించాడు గుణశేఖర్. భారీ సెట్టింగ్ తో రూపొందించిన మధుర మీనాక్షి టెంపుల్ సెట్టింగ్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
తాజాగా గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’ ఈ సినిమా సెప్టెంబర్ 4 న విడుదల కాబోతుంది. గుణ శేఖర్ రుద్రమదేవి సీక్వెల్ కూడా ప్లాన్ చేయబోతు న్నాడట. రుద్రమదేవి మనువడు ప్రతాపరుద్రుడి చరిత్రతో ఈ చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నాడట. రుద్రమదేవి మనుమడు ప్రతాప రుద్రుడు చాలా చరిత్ర కలిగిన రాజు. శౌర్య పరాక్రమాలకు ఆయన పెట్టింది పేరు. ఈయన కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం కేరళ వరకు విస్తరించిందని చరిత్ర చెబుతుంది. ఇలాంటి పవర్ ఫుల్ ఇతిహాసం కలిగిన ప్రతాపరుద్రడు గా నటించాలంటే మామూలు హీరోతో కుదరని పని అందుకోసమే గుణశేఖర్ తనకు అత్యంత ఆప్తుడైన మహేష్ బాబును ఈ పాత్రకు తీసుకోవాలని అనుకుంటున్నారట.
గతంలో రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రకు మహేష్ బాబును తీసుకోవాలని సంప్రదించగా ఆ టైమ్ లో డేట్స్ కుదరక నటించలేక పోయాడట ప్రిన్స్. ఇప్పుడు సీక్వెల్ లో మనవడి పాత్రను మహేష్ తో చేయించాలనుకుంటున్నాడట. మరి.. మహేష్ ఏమంటాడో తెలియాల్సి ఉంది. అయితే ప్రతాపరుద్రుడి పాత్ర కోసం అల్లు అర్జున్ కూడా అనుకున్నప్పటికీ.. రుద్రమదేవి లో అత్యంత పవర్ ఫూల్ పాత్ర అయిన గోనగన్నారెడ్డి పాత్రలో ఇప్పటికే పాపులర్ అయ్యాడు అల్లు అర్జున్. మరి.. రుద్రమదేవి మనవడు ఎవరో తెలియాలంటే కొన్నిళ్లు వేచి చూడాల్సిందే.
source:http://www.apherald.com/Movies/ViewArticle/93516/gunasekhar-mahesh-babu-rudramadevi-pratapa-rudrudu/
Post a Comment