అజంతా గుహలు
.మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. [1] మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'.[2] . ఔరంగాబాద్ జిల్లా లోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న అజంతా గుహలు మనకు వారసత్వంగా అందిన అపురూపమైన చారిత్రక సంపద. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దం నాటివని చెబుతారు. ఇక్కడ కనబడుతున్న చిత్రకళలో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినవి. గుహల లోపల అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కనబడుతుంది.
అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (UNESCO) వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా పరిగణించబడుతున్నాయి. ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా గ్రామానికి వెలుపల ఈ గుహలు ఉన్నాయి. దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండపై ఇవి నెలకొని ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి.
.శిల్పకళ!
గుహలను బుద్ధిజానికి సంబంధించిన శిల్పకళను దాచుకున్న కళా నిలయాలుగా వర్ణించవచ్చు. కొన్ని శిల్పాలు తెరవాడ సంప్రదాయంలో కిరీటం, పాదముద్రలు మాత్రమే ఉంటాయి. మరికొన్ని మహాయాన సంప్రదాయంలో శిల్పాలుగా గోడల్లో తీర్చిదిద్దిన మురల్స్ రూపంలో ఉన్నాయి. ఈ చిత్రాల్లో బుద్ధుడు, ఇతర బోధిసత్వుల జీవితాలు, జాతక కథలు చిత్రించారు. రెండో గుహలో బుద్ధుని పుట్టుకకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి.
దీని పైకప్పుపై ఉన్న హంసలు బారులు తీరిన చిత్రం ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆనాటి ప్రజలు వాడిన పర్సులు, మఫ్లర్లు, చెప్పులను సైతం చిత్రాల్లో చూడవచ్చు. క్రీ.పూ. 2-7 శతాబ్దాల మధ్యకాలంలో వీటిని చిత్రించినట్టుగా ఆధారాలున్నాయి. ఆనాడు వేసిన రంగులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం చూపరులకు ఆశ్చర్యచకితులను చేస్తుంది.
Post a Comment