బాహుబలి పార్ట్ 2 కథ ఇదేనా..?

ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ‘బాహుబలి’ ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా విడుదల అయ్యే కొన్ని రోజుల ముందు స్టోరి గురించి రక రకాలుగా కథనాలు వచ్చాయి. ఈ కథనాలు చదివి సినిమా గురించి మరింత అంచనాలు వేసుకోవడం మొదలు పెట్టారు అభిమానులు.  అయితే ‘బాహుబలి’ పార్ట్ 1 విడుదల అయ్యింది. ఇప్పుడు పార్ట్ 2 విడుదల కాబోతుంది. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కథ ఇదే నంటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి ఆ కథ మీకోసం.

బాహుబలి పార్ట్ 2 లో కుంతల దేశపు యువరాణి దేవసేనతో బాహుబలి మరియు భల్లాలదేవలు ప్రేమలో పడతారు. అయితే దేవసేన మాత్రం బాహుబలిని ప్రేమిస్తుంది బాహుబలి ప్రేమను శివగామి ఒప్పుకోదు దాంతో దేవసేనతో కలిసి బాహుబలి మహిస్మతి రాజ్యం వదిలి వెళ్తాడు. భల్లాలదేవుడు మహిస్మతి రాజు అవుతాడు. అలా కొన్ని రోజు గడిచిన తర్వాత కాలకేయులు మరోసారి మహిస్మతిపైకి దండెత్తి వస్తారు. వారిని ఎదుర్కోవడం భల్లాలదేవుడి తరం కాదు. విషయం తెలుసుకున్న బాహుబలి మహిస్మతి రాజ్యంను కాపాడేందుకు యుద్దంలో దిగుతాడు. యుద్దంలో కాలకేయులను అంతమొందించి మహిస్మతిని గెలిపిస్తాడు.

యుద్దం పూర్తి అయిన తర్వాత సింహాసనంకు కట్టు బానిస అయిన కట్టపతో బాహుబలిని భల్లాలదేవుడు చంపిస్తాడు. భల్లాలదేవకు మద్దతు ఇచ్చి పెద్ద తప్పుచేశాను అని తెలుసుకున్న శివగామి కన్న కొడుకు అని కూడా చూడకుండా చంపేందుకు ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. ఆ సమయంలోనే దేవసేన కొడుకుకు జన్మనిస్తుంది. ఆ కొడుకును చంపాలని భల్లాలదేవుడు ప్రయత్నిస్తాడు. దాంతో శివగామి పసి బాలుడుని కాపాడి చనిపోతుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/91234/ss-rajamouli-prabhas-rana-anushkha-ramya-krishna-t/

No comments