మగధీరలో అల్లు అర్జున్, రాంచరణ్..!!

తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన మగధీర తెలుగు చలన చిత్ర సీమలో మరుపురాని సినిమాగా గుర్తుండి పోయింది. అప్పటి వరకు టాలీవుడ్‌ ఉన్ని రికార్డులన్నింటినీ తిరగరాసింది. తర్వాత ఈ సినిమాను తమిళంలో ‘మావీరన్’ అనే టైటిల్ తో విడుదల చేశారు. అక్కడ కూడా రికార్డుల మోత మోగించింది. గత సంవత్సరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా ‘ఎవడు’ అనే చిత్రాన్ని చేశాడు. ఈ సినిమాలో చెర్రి, బన్ని ఇద్దరు ఒక్క ఊపు ఊపారు.

ఈ చిత్రం కూడా కమర్షియల్‌గా ఓకే అనిపించుకొంది. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో విడుదల చేయబోతున్నారు...భద్రకాళి ఫిలింస్‌ పతాకంపై భద్రకాళి ప్రసాద్‌ ‘ఎవడు’ అనువాద హక్కులనుకొని ‘మగధీర’ పేరుతో తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అడ్డా వెంకట్రావ్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో తమిళంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ అభిమానులు  కన్ఫ్యూజన్‌ అయిపోతున్నారు ఎందుకంటే  ‘మగధీర’ సర్చ్ చేస్తే రాంచరణ్, కాజల్ నటించిన రాజమౌళి చిత్రం వస్తుంది. మరి అల్లు అర్జున్, రాంచరణ్ లు ఉన్న పోస్టర్ చూస్తే అల్లు అర్జున్ ‘మగధీర’లో నటించాడా అని జుట్టు పీక్కుంటున్నారు. 
source:http://www.apherald.com/Movies/ViewArticle/91149/magadheera-ss-rajamouli-yevadu-ram-charan-allu-arj/

No comments