200 కోట్ల క్లబ్ లో చేరనున్న బాహుబలి..?!!

ఇప్పటి వరకు తెలుగు సినిమాలు వంద కోట్లు దాటితే అది వండర్ అనే చెప్పాలి. ఈ మద్య బాలీవుడ్ లో ఈ వందకోట్ల వసూళ్లు కామన్ అయిపోయాయి. పెద్ద పెద్ద హీరోలు సినిమాలు అయితే 200 క్లబ్ లో చేరడం అంటే మంచి హిట్ టాక్ వచ్చినట్లే అది కూడా... వారం రోజుల లోపేనండోయ్.. ఇప్పుడు రాజమౌళి తీర్చిదిద్దిన ‘బాహుబలి’  ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు 180 కోట్లకు పైగా వసూల్ చేసి 200 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది .

తోలి మూడు రోజుల్లోనే 150కోట్లకు పైగా వసూల్ చేసి సంచలనం సృష్టించిన బాహుబలి ఈరోజు కి 200కోట్ల క్లబ్ లో చేరిపోనుంది. ఇప్పటికే అమెరికాలో పీకే సినిమా లాంటి హిట్ సినిమాను పక్కకు నెట్టి రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు బాహుబలి  ప్రపంచ వ్యాప్తంగా  విశేష ప్రజాదరణ పొందుతోంది. తమ చిత్రాన్ని ఇంతగా ఆధరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు కృతజ్క్షతలు తెలుపుకుంటున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/91210/baahubali-rajamouli-tollywood-movies-biggest-hit-m/

No comments