దేశోధ్ధారక నాగేశ్వరరావు గారు




అమృతాంజనం తెలియని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగువారేకాదు యావత్ భారతదేశం అమృతాంజనం సీసా కోసం ఎదో ఒక సందర్భంలో ప్రయత్నించి ఉపశమనం పొందినదే.
ఈ ఔషధానికి సృష్ఠికర్త శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు . వీరు స్వచ్చమైన పదహారు అణాల తెలుగువారు.
ఈయన ఎన్నో పరిశోధనలు చేసి 1893 లో పలు రకాల బాధల నుండీ ఉపశమనం కోసం రూపొందించిన దివ్య ఔషధం అమృతాంజనం....తలనొప్పి నుండీ ... జలుబు ,గొంతునొప్పి , కీళ్ల నొప్పులు , వెన్ను నొప్పి వగైరాలకి దివ్యౌషధంగా పని చేస్తుంది.
శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు .1909 లో ఈయన ప్రారంభించినదే ప్రధమ తెలుగు పత్రిక "ఆంధ్ర పత్రిక".
ఈయనే "ఆంధ్ర గ్రంధ మాల " అనే తెలుగు సాహితీ ప్రచురణాలయాన్ని 1926 లో స్థాపించినది.
గాంధీగారి పిలుపుతోటి "ఉప్పు సత్యాగ్రహం" లో పాల్గొని 1930 లో జైలుకి వెళ్ళారు ఈయన...జైల్లోనే "భగవత్గీత" మీద వ్యాసాలు వ్రాశారు..."భగవత్గీత ఒక్క విశ్వాసానికో ఒక్క ధర్మానికో చెందినది కాదు "అని పేర్కొనేవారు.
వీరు కొనుగోలు చేసిన గృహములో జరిగిన ఒప్పందమె శ్రీబాగ్ ఒప్పందం అంటారు. "శ్రీబాగ్" అంటే వీరి గ్రుహము పేరు.గాంధీగారు చెన్న పట్నానికి వచ్చినప్పుదల్లా శ్రీబాగ్ నే వారికి విడిది. తమిళనాడు ప్రభుత్వం వీరి గ్రుహానికి చుట్టుపక్కల ప్రాంతాన్ని వీరి గౌరవార్ధం "నాగేస్వరపురం" అని నామకరణం చేసింది.
భారతదేశానికి వీరు చేసిన సేవలకు గుర్తుగా వీరిని "దేశోధ్ధారక నాగేశ్వరరావు గారు" అని సంబోధించి భారత ప్రభుత్వం వీరి ముఖచిత్రం తో పోష్టల్ స్ఠాంప్ ముద్రించినది.

No comments