' రుద్రమదేవి ' రిలీజ్ డేట్ ఈసారి పక్కా అట !!


అనుష్క  టైటిల్ రోల్ గా చేసిన అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.అందులో అనుష్క నటనకి అందరు ముగ్దులైపోయారు.మళ్ళీ అంతే ఫవర్ ఫుల్ రోల్ లో అనుష్కని గుణశేఖర్ రుద్రమ దేవి గా తెరకెక్కించాడు. ఇందులో అల్లు అర్జున్, రానా లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదలకి ఇంతవరకూ నోచుకోలేకపొయింది. అనేక కారణాలవల్ల దాదాపు సంవత్సరం నుండి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటువస్తున్నారు. ఒక సారి ఆర్దిక ఇబ్బదుల వల్ల, ఇంకోసారి సరైన సమయం లేకపోవడం వీటి వల్ల వాయిదా పడుతూనే ఉంది.

చివరికి రుద్రమ దేవి ని రిలీజ్ చేస్తున్నట్టు అధికారికం గా  ప్రకటన చేసారు. విడుదల డేట్ కూడా ప్రకటించారు. ఈ డేట్ కి నూరు శాతం విడుదల అవటానికి అవకాశాలున్నాయి.

తాజాగా ఈ సినిమా యూనిట్ సబ్యులు ప్రెస్ మీట్ పెత్తి విడుదల తేదీని ప్రకటించారు. సినిమాని సెప్టెంబర్ 4 న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు గుణశేఖర్ అధికారికం గా ప్రకటించారు. త్రీడీ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రెక్షకులకు అధుతాన్ని ఆశ్చర్యాన్ని అందిస్తాయి అని గుణశేఖర్ చెప్పారు.

ఇప్పటి వరకు సేఫ్ జోన్ లో విడుదల చేయాలని ఎదురుచూసిన గుణశేఖర్ ఇప్పుడు తాను అనుకున్నట్టుగానే సేఫ్ జోన్ లో విడుదల చేస్తున్నరు. కోట్లు ఖర్చు పెట్టి ఎక్కువ సంఖ్యలో భారీ సెట్టింగులు వేసి, తెలుగు ప్రేక్షకులకు కాకతీయుల వైభవాన్ని చూపించబోతున్నడు. సాధ్యాసాధ్యాలకు తావు లేకుండా అనేక భారీ సెట్టింగ్స్ వేయించాడు. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్, రానా లు ప్రధాన ఆకర్షణ గా నిలువబోతున్నారు. గోన గన్నారెడ్డి పాత్ర అత్యంత ప్ర్రత్యేకంగా ఉండబోతొందట. ఈ పాత్రలో అల్లు అర్జున్ చాలా బాగా చేసారని చెబుతున్నారు.

ఇంకా ఈ సినిమా విడుదలకి చాలా సమయం ఉండటం తో గుణశేఖర్ ప్రమోషన్ పనులు ప్రారంబించేశారు. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళం , మళయాళం లో కుడా విడుదల చేయటానికి సన్నహాలు చేస్తున్నారట.

No comments