రాజమౌళి స్కెచ్: టాలెంట్ ని వాడుకొని ఘోరంగా మోసం చేసారట


తాజాగా వెలుగులో వచ్చిన ఓ ఆర్టిస్ట్ ఆవేదన..వెబ్ మీడియాలో హాట్ హాట్ గా స్ర్పెడ్ అవుతుంది. తన ఆవేదన నిజమే కదా.. అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఓ స్కెచ్ లు వేసుకునే ఆర్టిస్ట్ కే... రాజమౌళి స్కెచ్ వేయటం అతడికి షాక్ ని ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, బాహుబలి సినిమా ఎన్ని రికార్డ్ లు క్రియేట్ చేసిందో, ఆ మూవీకి సంబంధించిన వివాదాలు కూడ అదే స్థాయిలో ఉన్నాయి. అయితే అవన్నీ నిజమో? కాదో తెలియదు కాని, ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ లోని సభ్యుడే ఓ వివాదాన్ని తెరపైకి తీసుకురావడం షాకింగ్ ఉంది. అతడి పేరు మను జగద్.

ఇతను సౌత్ ఇండియాలో పేరున్న ఆర్ట్ డైరెక్టర్. బాహుబలి కోసం తనను ఆర్ట్ డైరెక్టర్ గానే తీసుకున్నారు. రెండేళ్లు ఆ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు. తెరమీద టైటిల్స్ లో మాత్రం తనకు ‘ఆర్ట్ అసిస్టెంట్’ అనే క్రెడిట్ ఇచ్చినందుకు, తెగ బాధపడిపోయాడు. తనకు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని అంటున్నాడు జగద్. తన ఫేస్ బుక్ పేజీలో ‘దేవుడు నన్ను మోసం చేశాడు’ అనే శీర్షికతో పెద్ద పోస్ట్ పెట్టాడు మను. మొదట్లో ఈ పోస్ట్ కి అంతగా స్పందన రాలేదు. కాని ఆ పోస్ట్ ని చివరికి వరకూ చదివిన వారికి..గుండెల్లో బాధని గుర్తుకి తెస్తుంది. వెంటనే ఆ పోస్ట్ ని షేర్ చేయటం మొదలు పెట్టారు. ఇంకేముందు, ప్రతి ఒక్కరు మదన్ కి జరిగిన అన్యాయాన్ని చదివి..రాజమౌళి వేసిన స్కెచ్ కి నిరశన తెలుపుతున్నారు. ఇంతకీ ఆ పోస్టులో అతనేమంటున్నాడంటే..

‘‘సాబు సిరిల్ నా గురువు. ఆయన దగ్గర పదేళ్లు పని చేశా. నేను16 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశాను. కానీ ఇప్పుడు నన్ను‘ఆర్ట్ అసిస్టెంట్’ స్థాయికి తీసుకొచ్చింది బాహుబలి టీమ్. ఆ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాను. బాహుబలి కోసం ఉపయోగించిన స్కెచ్ లు అన్నీ నేను వేసినవే. ఈ సినిమా కోసం పని చేస్తూ నా కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చింది. శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నా. కొన్ని రోజుల పాటు నా కళ్లు కనిపించని పరిస్థితి వచ్చింది. పూర్తిగా కోలుకోకుండానే మళ్లీ బాహుబలి కోసం పని చేశా. నా వల్ల కాదన్నా సాబు సిరిల్ నాతో పని చేయించుకున్నారు. సినిమా కోసం కాస్ట్యూమ్స్ కూడా చాలా డిజైన్ చేసి ఇచ్చాను. ఓ టెక్నీషియన్ కు డబ్బులు తక్కువిచ్చినా సర్దుకుంటాడు కానీ.. క్రెడిట్ ఇవ్వకుంటే తీవ్రంగా ఆవేదన చెందుతాడు.

నా కుటుంబంతో కలిసి బాహుబలి సినిమాకు వెళ్లా. కానీ నాకు ఆర్ట్ అసిస్టెంట్ అని క్రెడిట్ ఇచ్చారు. నాకిది తీవ్ర అవమానం. ‘మీరు నన్ను ఆర్ట్ డైరెక్టర్ని చేశారు. 16సినిమాలకు అదే హోదాలో పని చేశాను. ఇప్పుడు మీరు నన్ను ఆర్ట్ అసిస్టెంట్ గానూ మార్చారా’ అని సాబు సిరిల్ సర్ కి మెసేజ్ పెట్టాను. ఆయన సారీ అని ఎక్కడో పొరబాటు జరిగిందని రిప్లై ఇచ్చారు. ఇంత పెద్ద సినిమాకు ఇలాంటి పొరబాటు చేస్తారా?నన్నిప్పుడు బాహుబలి-2కు అడుగుతున్నారు. కానీ నేను పని చేయను. ఈ విషయంలో నేను వ్యక్తుల్ని నిందించను. దేవుడే నన్ను మోసం చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/92223/keeravani-rajamouli-bollywood-baahubali-baahubali2/

No comments