బయట పడిన శ్రీమంతుడు ట్విస్ట్ !

ఆగష్టు మొదటివారంలో విడుదల కాబోతున్న ‘శ్రీమoతుడు’ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా మారుతుందా అని భయపడుతున్న మహేష్ అభిమానుల భయం పోగొట్టడానికి ఈసినిమా యూనిట్ ఈసినిమా కధకు సంబంధించిన ముఖ్యమైన ట్విస్ట్ ను లీక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక లవ్ స్టోరీ అన్న వార్తలు వస్తున్నాయి.

హర్ష గా మహేష్ చారుశీల గా శృతిహాసన్ ఈ సినిమాలో కాలేజ్  స్టూడెంట్స్ గా చాలసేపు కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంలో వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమసన్ని వేసాలతో పాటు వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అదిరిపోతాయని టాక్. యూత్ ను టార్గెట్ చేయడానికి ఈ సన్నివేశాల చిత్రీకరణ విషయంలో దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చిన్న మెసేజ్ అంతర్లీనంగా ఉండే లవ్ స్టోరీగా ఈసినిమాను మలిచారని ముఖ్యంగా జగపతి బాబు, మహేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు చాల కీలకంగా మారుతాయి అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎప్పుడూ లేనివిధంగా మహేష్ చాల అందంగా కనిపిస్తూ ఉండటంతో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఒక లవ్ స్టోరీగా ‘శ్రీమంతుడు’ మారుతుంది అని అంటున్నారు.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గా చేయడానికి ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ప్రయత్నాలు ప్రారంభించింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా కథ ఒక లవ్ స్టోరీ కాబట్టి మహేష్ ఇరు రాష్ట్రాలలోను ప్రముఖ  కాలేజీలను టార్గెట్ చేస్తూ కొన్ని కాలేజీలలో స్వయంగా మహేష్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపడతాడని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా ‘శ్రీమంతుడు’ విషయమై అన్ని జాగ్రత్తలు మహేష్ తీసుకుంటున్నాడనే అని పిస్తోంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/92131/SREEMANTHUDU-TWIST-COMMING-OUT/

No comments