బాహుబలి పై గుణశేఖర్ సెటైర్లు ?

నిన్న ఉదయం గుణశేఖర్ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యల పై ఫిలింనగర్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తన ‘రుద్రమదేవి’ సినిమా విడుదల తేది ప్రకటించాక గుణశేఖర్ ఈవ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలు గుణశేఖర్ అన్న వెంటనే పెనుదుమారాన్ని సృస్టిస్తున్నాయి. 

‘ఈసినిమా సెట్ ల కోసమో, గ్రాఫిక్స్ కోసమో తీసిన సినిమా కాదు, జానపదం అంతకన్నా కాదు, జరిగిన కథ తెలుగు చరిత్ర, కథనే ప్రధానంగా తీసుకుని, కథనే బలంగా నమ్ముకుని తీసిన సినిమా. మిగతా త్రీడీ, గ్రాఫిక్ వ్యవహారాలన్నీ అదనపు ఆకర్షణలే. కథను నమ్ముకుని నేను ఈ ప్రయత్నం చేసాను'  అంటూ చేసిన వ్యాఖలు యధాలాపంగా అన్న మాటలు కావని ఆ మాటలు ‘బహుబలిని’ ని దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలు అంటూ ఫిలింనగర్ లో కొందరు ఆ మాటలకు అర్ధాలు తీస్తున్నారు. 

ఈ మధ్య విడుదల అయిన ‘బాహుబలి’ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నా ఆ సినిమా ప్రథమ భాగానికి కథమైనస్ అని కొందరు కామెంట్ చేసిన నేపధ్యంలో ఆ కామెంట్స్ కు బలం చేకూరుస్తు గుణశేఖర్ ఈ వ్యాఖ్యలు చేసాడు అంటూ అర్ధాలు తీస్తున్నారు. అంతే కాదు ‘బాహుబలి’ చూస్తున్న జనం అంతా ఆ సినిమాలోని  సెట్ లకోసం, గ్రాఫిక్స్ కోసమేచూస్తున్నారు అనే అర్ధాన్ని గుణశేఖర్ మాటలు కలిగిస్తున్నాయి అంటూ కొత్త ప్రచారాన్ని తెర పైకి తీసుకు వచ్చారు.

అనుష్క రుద్రమదేవిగాగుణశేఖర్ ఎన్నో ఆసలు పెట్టుకుని నిర్మించిన ‘రుద్రమదేవి’ రిలీజ్ డేట్ ను అధికారికంగా సెప్టెంబర్ 4న విడుదల అని ప్రకటించడంతో ఈ సినిమాకు సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది అనుకోవాలి. అయితే ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా రిలీజ్ ఈ ప్రకటించిన తేదీకి అయినా విడుదల అవుతుందా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/92130/GUNASEKHAR-SETAIRS-ON-BAHUBALI--/

No comments