శ్రీమంతుడు బయ్యర్లకి షాక్ ఇచ్చిన నమ్రత?


మహేష్ నటించిన సినిమా 'శ్రీమంతుడు ' త్వరలోనే విడుదల కాబోతుంది.దీనికి సంబందించి డిస్త్రిబ్యూటర్ల మార్కెటింగ్ జరుగుతుంది.అయితే మహేష్ భార్య నమ్రత చెప్పిన మాటలకి బయ్యర్లు షాక్ అవుతున్నట్లు టాక్.

అయితే ఆమద్య మహెష్ సినిమాల కధల ఎంపికలో నమ్రత జోక్యం ఎక్కువయిందంటూ గాసిప్పులు హల్చల్ చేసాయి. కాని తరువాత ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మాటలను కొట్టిపారేసింది నమ్రత. తరవాత వాటి ఊసే లేదు.

అయితే తాజాగా వచ్చే నెల విదుదల కాబోతున్న ' శ్రీమంతుడు మార్కెటింగ్ విషయంలో నమ్రత చెపుతున్న మాటలకి బయ్యర్లు  భయపడిపోతున్నరట.  ఈసినిమాకు మహేష్ సొంత నిర్మాణ సంస్థ జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యవహారాలు మహేష్ భార్య నమ్రత స్వయంగా చూసుకుంటోoదని టాక్.

దానితో ఈ సినిమా విషయంలో నమ్రత జోక్యం బాగ ఎక్కువయ్యి బుసినెస్స్ విషయంలో తమని బాగా ఇబ్బంది పెదుతున్నట్లు బయ్యర్లు కామెంట్లు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాకుండా ఆమె చెప్పే ఏరియా రేట్లు విని సినిమా కొనటానికి బయ్యర్లు భయపడిపోతున్నారట. అయితే ఇప్పటికే  మహేష్ కి రుస పరాజయాలు వచ్చినా కానీ ఉత్సాహంగా సినిమాని కొనటానికి వస్తున్న బయ్యర్లకి గట్టి షాక్ తగిలినట్టు టాక్.

అదలాఉంటే ఈ నెల 18న 'శ్రీమంతుడు ' ఆడియో విడుదల కాబోతుంది. అయితే ఆడుయో ఎంతవరకు హిట్ అవుతుందో చూసి అప్పుడే నమ్రత చెప్పిన రేట్లని పరిసీలించి నిర్ణయం తీసుకుందామని బయ్యర్లు నిర్ణయించుకున్నారట. మరిదంతా నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

No comments