అందుకే రాజమౌళిని రిజెక్ట్ చేసింది
ప్రస్తుతం అందరూ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి మూవీ గురించి మాట్లాడుకుంటుంటే, మరోవైను అతిలోక సుందరి శ్రీదేవి నటించబోతున్న పులి మూవీ గురించి సైతం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పులి మూవీలో శ్రీదేవి మహారాణి పాత్రలో కనిపించడం అనేది ఆందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే గతంలో బాహుబలి మూవీలో శ్రేదేవి నటించాల్సి ఉండగా, తర్వాత ఆ ప్రాజెక్ట్ నుండి శ్రీదేవి బయటకు వచ్చింటూ టాక్స్ వచ్చాయి. అసలు రాజమౌళి, శ్రీదేవి ల మధ్య జరిగింది ఏమిటి? కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి, శ్రీదేవిని బాహుబలి మూవీలో తక్కువ రెమ్యునరేషన్ కి ఆఫర్ చేశాడంట.
అయితే అదే సమయంలో శ్రీదేవి ముందుగానే తన కాల్షీట్స్ ని పులి మూవీ కోసం కేటాయించడంతో, రాజమౌళి ప్యాకేజ్ గురించి మాట్లాడకుండా, తన బిజి షెడ్యూల్ కారణంగా నటించలేను అంటూ బాహుబలిని రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తుంది. ఇక శ్రీదేవి విషయానికి వస్తే, ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీదేవి వరుసపెట్టి సినిమాలు చేస్తుందన్న తరుణంలో వచ్చిన ఆఫర్లను వదులుకుంటూ సినిమాలకు దూరంగా వుంటుంది.
అయితే సడన్ గా తమిళ సినిమా ‘పులి’లో నటిస్తూ ట్రైలర్లలో మహారాణిగా దర్శనమిచ్చింది. దుస్తుల ఎంపికలో, నగల సెలెక్షన్ లో శ్రీదేవి ప్రత్యేక శ్రద్ధ చూపించినట్టు సమాచారం. చింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పులి లో విజయ్, శృతిహాసన్, హన్సిక మరియు కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రధారులు.
Post a Comment