మహేష్ ను ఆశ్చర్యపరిచిన రాజమౌళి రివర్స్ కామెంట్స్ !
నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ‘బాహుబలి’ ప్రమోషన్ నిమిత్తం ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి తన సినిమా విశేషాలను వివరిస్తూ మధ్యలో మహేష్ బాబు పై ‘శ్రీమంతుడు’ సినిమా పై చేసిన రివర్స్ కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా మహేష్ రాజమౌళిల మధ్య ఇంత ప్రేమానురాగాలు ఉన్నాయా? అనే కొత్త ఆలోచనలకు తెర తీసింది.
కొంతమంది కేవలం హాట్ న్యూస్ లు సృష్టిద్దాము అన్న ఉత్సాహంతో తన ‘బాహుబలి’ కి మహేష్ ‘శ్రీమంతుడు’ కి సంబంధంలేని పోటీని క్రియేట్ చేసారని అయితే అటువంటి వార్తలతో తాను కాని మహేష్ కాని ఎటువంటి ఖంగారు పడకుండా తమ సినిమాల విడుదలకు సంబంధించిన లేటెస్ట్ పరిస్థితిని ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూనే వచ్చాము అన్న విషయం చాలమందికి తెలియదు అంటూ రాజమౌళి మహేష్ తో తనుకున్న సాన్నిహిత్యాన్ని బయట పెట్టాడు.
అయితే తన ‘బాహుబలి’ ని చూసి మహేష్ భయపడి ‘శ్రీమంతుడు’ వెనక్కు తగ్గాడు అన్న మాటల పై క్లారిటీ ఇస్తూ మహేష్ హుందాగా ఇచ్చిన సమాధానం తనకు ఎంతో నచ్చిందని తోటి హీరోల సినిమాలకు మంచి జరగాలని సినిమా పరిశ్రమ బాగుండాలి అని ఆలోచిస్తున్న మహేష్ ఉద్దేశ్యాన్ని సంకుచిత దృష్టితో చూస్తూ ‘బాహుబలి’ కి భయపడి ‘శ్రీమంతుడు’ వెనక్కి వెళ్ళాడు అని వార్తలు వ్రాసిన వారికి పాఠం చెప్పేలా మహేష్ హుందాగా ప్రవర్తించాడు అంటూ మహేష్ పై ప్రశంసలు కురిపించాడు రాజమౌళి.
‘బాహుబలి’ ‘శ్రీమంతుడు’ సినిమాలలో ఏ సినిమా విజయవంతం అవుతుంది అంటూ మరికొందరు వార్తలు వ్రాస్తున్నారని తాను వ్యక్తిగతంగా ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని కామెంట్స్ చేసాడు రాజమౌళి. అంతేకాదు ఈ రెండిటిలో ఏ ఒక్క సినిమా పరాజయం చెందినా తనకు ఆనందం ఉండదని తాను పరిపూర్ణంగా ఆనందం పొందాలి అంటే ఈ రెండు సినిమాలు ఘనవిజయం పొందినప్పుడే తనకు నిజమైన ఆనందం అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు జక్కన్న. ఈ కామెంట్స్ ను బట్టి చూస్తూ ఉంటే వెనువెంటనే కాకపోయినా ఎదో ఒక సమయంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ సినిమా వస్తుంది అన్న సంకేతాలు వీరిద్దరి మాట తీరులోనూ స్పష్టమౌతోంది..
source:http://www.apherald.com/Movies/ViewArticle/90411/MAHESH-GOT-STUNNED-WITH-RAJAMOULI-REVERSE-COMMENTS/
Post a Comment