ప్ర‌భాస్ ని ఎఫైర్ కి ఒప్పిస్తుందా?


మొన్న‌టి వర‌కూ బాహుబ‌లి మూవీలో న‌టించ‌ని హీరో ప్ర‌భాస్ కేవ‌లం సౌత్ స్టార్ హీరో. ఇప్పుడు ప్ర‌భాస్ పేరు ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కిన బాహుబ‌లి మూవీలో హీరో ప్ర‌భాస్ కావ‌డంతో, ప్ర‌తిఒక్క‌రు ప్ర‌భాస్ యాక్ష‌న్ పై ఆస‌క్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే బిటౌన్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్ బ్యూటీ, ప్ర‌భాస్ తో ఎఫైర్ పెట్టుకోవ‌టానికి సిద్ధంగా ఉంది.

దీనికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే, వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఒక సినిమా కోసం మరే సినిమా చేయకుండా రెండున్నరేళ్ళు ఒక సినిమాకే కాల్షీట్స్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. కానీ అలాంటి రేర్ ఫీట్ చేసిన టాలీవుడ్ ఆరడుగుల ఆజానుబాహుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మిర్చి తర్వాత కేవలం బాహుబలి సినిమా కోసం ప్రభాస్ వర్క్ చేసారు. రెండున్నరేళ్ళు ఎంతో కష్టపడి చెక్కిన ఈ భారీ పీరియాడికల్ ఫిల్మ్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.

ముంబైలో కూడా ఈ సినిమ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అయితే అక్క‌డి వెబ్ మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భాస్ ఈ విధంగా స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌భాస్ కి బిటౌన్ లో క్రేజీ హీరోయిన్ ఎవ్వ‌రు? అని అడిగితే... ఈ అందగాడు వెంట‌నే దీపికా ప‌దుకొనె అని చెప్పుకొచ్చాడు. వెంట‌నే వెబ్ మీడియా మ‌రో ప్ర‌శ్న వేసింది. బిటౌన్ కి సంబంధించిన స్టార్ హీరోయిన్ మీతో ఎఫైర్ పెట్టుకోవ‌టానికి సిద్ధంగా ఉంది? అది ఎవ‌రో తెలుసా? అని అడిగారు.

తెలియ‌దు అని స‌మాధానం ఇచ్చిన ప్ర‌భాస్ కి ఆ హీరోయిన్ ఎవ‌రో వెబ్ మీడియా చెప్పేసింది. ఇంత‌కీ ఎవ‌రో తెలుసా? త‌నే ప‌రిణితి చోప్ర‌. అవును ప‌రిణితి చోప్ర‌కి సౌత్ ఇండ‌స్ట్రీలోని హీరోల‌లో ప్ర‌భాస్ ఫిజిక్ చాలా హాట్ గా ఉంటుంద‌ని రీసెంట్ గా ఓ టివి షో కామెంట్ చేయ‌ట‌మే కాకుండా, త‌న‌కి అవ‌కాశం వ‌స్తే త‌న‌తో ఎఫైర్ పెట్టుకుంటాన‌ని చెప్పుకొచ్చింది. ఈ మాట‌లు విన్న ప్ర‌భాస్ వెంట‌నే షాక్ అయ్యాడ‌ని తెలిసింది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/90397/sonakshi-sinha-bollywood-tollywood-parinithi-chopr/

No comments