పవన్ కోసం త్రివిక్రమ్ మళ్లీ రెడీ అయ్యాడు..!!
తెలుగు చిత్ర సీమలో ఏ కాంబినేషన్ వింటే సూపర్ డూపర్ హిట్టో ఆ క్రేజీ కాంబినేషనే పవన్ కళ్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సూపర్ హిట్ అని అందరికీ తెలుసు. త్రివిక్రమ్ తీసిని సినిమా సన్నాఫ్ సత్యమూర్తి పెద్ద హిట్ కాకపోయినా కమర్షియల్ గా మాత్రం బాగానే డబ్బు సంపాదించింది. ఈ సినిమా తర్వాత ఏ సినిమా కమిట్ అవ్వలేదు. దానికి కారణం ఇప్పుడు అగ్రహీరోలు మొత్తం బిజీ షెడ్యూల్, రాంచరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఇప్పటికే సినిమాలతో కమిట్ అయి షూటింగ్ మొదలైయ్యాయి.
అయితే గబ్బర్ సింగ్ 2 షూటింగ్ మొదలైంది కానీ పవన్ కళ్యాన్ ని ఒప్పించి త్రివిక్రమ్ తో సినిమా కుడా సెట్స్ పైకి తీసుకువస్తున్నట్టు తెలిసింది. మరి వీరి క్రేజీ కాంబినేషన్ తో మరో హిట్ సాధించ బోతున్నారన్నమాట.
source:http://www.apherald.com/Movies/ViewArticle/90428/pawan-kalyan-upcoming-film-trivikram-srinivas-atta/
Post a Comment