అసలు విషయాన్నితేల్చిన పవన్ కళ్యాణ్
పవన్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుత రాజకీయాలపై మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే తను ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయ పరిస్థితులపై సెటైర్స్ వేస్తూ ముందుకు వస్తున్నాడు.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాన్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ గబ్బర్ సింగ్ 2 తరువాత పవన్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనంతరం పవన కళ్యాణ్ తన సమయాన్ని పూర్తిగా రాజకీయాలకు కేటాయిస్తాడని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు సైతం పవన్ కళ్యాణ్ కి ఏదొకదారిని మాత్రమే ఎంచుకోవాలని బలంగా సూచిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ సైతం గబ్బర్ సింగ్2 మూవీ గతంలో ఒప్పుకున్న కారణంగా, ఇప్పుడు చేయాల్సి వస్తుందని, లేదంటే ఆ ప్రాజెక్ట్ ఆపేసి..మరో మూవీతో సరిపెడితే బాగుండేదంటూ చాలా సార్లు అనుకున్నాడంట.
మొత్తంగా పవన్ కళ్యాణ్ నుండి క్లియర్ డెసిషన్ బయటకు రావడంతో, ఇక పవన్ కళ్యాణ్ తనఅప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు పూర్తి చేసి, రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తాడో అంటూ అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/90463/power-star-pawan-kalyan-tollywood-janasena-janasen/
Post a Comment