రచ్ఛః పొలిటికల్ టీడర్ తో పెట్టుకున్న సమంత
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్, స్టార్ డంని సంపాదించుకున్న బ్యూటీ సమంత. ప్రస్తుతం సమంత చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా తన గ్రీన్ సిగ్నల్ కోసం మరో అయిదు ప్రాజెక్ట్స్ చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా సమంత ఇబ్బందుల్లో పడిందంటూ కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సమంత ప్రస్తుతం ఒక్క సినిమాలతోనే కాకుండా సమయం దొరికినప్పుడు తన సమయాన్ని సమాజసేవ కోసం ఉపయోగిస్తుంది. ఫిల్మ్ సెలబ్రిటి ఎవరైన సరే, సమాజ సేవ చేస్తున్నారంటే చాలు...వారి వద్దకు సోసిషయల్ సర్వీస్ చేసే వారు సెలబ్రిటి సేవలను ఉపయోగించుకోవటం కోసం ఇంటి దగ్గర క్యూలో ఉంటారు.
అయితే తాజాగా తమిళ నాడు లో పేద బాలికల సహాయార్ధం ఓ సంస్థ సమంత చేత ప్రచారం చేయిద్దాం అనుకుంది. అయితే వారు దగ్గరలోని ఓ పేరున్నరాజకీయ వేత్త వద్దకు వెళ్ళి, సమంతతో మాట్లాడాల్సిందా కోరారు. అప్పటి నుండి ఆ పొలిటికల్ లీడర్ దాదాపు 10 సార్లు ఫోన్ చేసినా, సమంత లిప్ట్ చేయలేదంట.
అంతే కాకుండా, ఆ పొలిటికల్ లీడర్ తన పి.ఎ ని పంపించినా మళ్ళీ మాట్లాడదాం.. అంటూ రెస్పాన్స్ ఇవ్వలేదంట. దీంతో సీరియస్ అయిన రాజకీయనాయుడు.. తన తడాఖ ఏంటో సమంతకి చూపించాడంట. వెంటనే సమంత జరిగిన దానికి సారీ చెప్పుకొని, తను పేద బాలికలకోసం సహాయం చేసే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పుకొచ్చిందంటూ కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/90464/samantha-tollywood-telugu-films-telugu-news-kollyw/
Post a Comment